boAt Watch Xtend : మార్కెట్లో బోట్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు ఆశించే వారి కోసం boAt Watch Xtend ఒక ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్ మోడల్‌గా నిలిచింది. ఇన్-బిల్ట్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, భారీ స్క్రీన్ ,స్ట్రెస్‌తో పాటు రకరకాల హెల్త్ ట్రాకింగ్ ఆప్షన్లతో వస్తున్న ఈ వాచ్ ఇప్పటికీ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అసలు ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌వాచ్ రంగంలో.. బోట్ ఎక్స్‌టెండ్ సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. చాలా మంది యూజర్లు తమ డైలీ లైఫ్‌ని మరింత ఈజీగా మార్చుకోవడానికి ఈ వాచ్‌ను ఎంచుకుంటున్నారు. ఇందులో ఉన్న మెయిన్ హైలైట్స్ , దీని బ్యాటరీ లైఫ్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌వాచ్‌కి ఉన్న అతిపెద్ద హైలైట్ , దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఇన్-బిల్ట్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉండటమే. మీరు కేవలం వాచ్‌తో మాట్లాడి వాతావరణ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు, అలారమ్‌లు సెట్ చేయవచ్చు లేదా లైవ్ క్రికెట్ స్కోర్ అడగవచ్చు. మీ వాయిస్ కమాండ్స్‌కు ఇది చాలా త్వరగా రెస్పాండ్ అవుతుంది.
డిజైన్ పరంగా బోట్ ఎక్స్‌టెండ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో 1.69 ఇంచ్ స్క్వేర్ HD ఎల్‌సిడి డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ కంప్లీట్ కెపాసిటివ్ టచ్ ఎక్స్‌పీరియన్స్‌తో వస్తుంది కాబట్టి టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని ఆటో-బ్రైట్‌నెస్ ఫీచర్ వల్ల ఎండలోకి వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్ పెరిగి, స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే.. ఇందులో క్లాసిక్ బ్లాక్, డీప్ బ్లూ, శాండీ క్రీమ్ , ఆలివ్ గ్రీన్ వంటి ట్రెండీ కలర్స్ లభిస్తాయి.
ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం.. బోట్ ఇందులో చాలా మంచి సెన్సార్లను జోడించింది. రోజంతా మీ గుండె వేగాన్ని గమనించే రియల్-టైమ్ హార్ట్ రేట్ మానిటర్ ఇందులో ఉంది. దీంతో పాటు రక్తంలో.. ఆక్సిజన్ శాతాన్ని చూపే SpO2 ట్రాకర్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుత బిజీ లైఫ్‌లో మీ ఒత్తిడి స్థాయిలను లెక్కగట్టే స్ట్రెస్ మానిటరింగ్ ఫీచర్ , రాత్రి నిద్ర నాణ్యతను అంచనా వేసే స్లీప్ ట్రాకర్ ఇందులో ఉన్నాయి. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి 14 రకాల యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
Also Read: boAt Stone 1000 రివ్యూ.. ఈ బడ్జెట్‌లో ఇంత పవర్‌ఫుల్ సౌండ్ బాక్సా!
ఈ స్మార్ట్‌వాచ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ పరంగా చాలా నమ్మదగినది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో ఇది హ్యాపీగా 5 నుంచి 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇందులో.. 5 ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే.. దాదాపు 50 మీటర్ల లోతు నీటిలో కూడా ఈ వాచ్ పాడవదు. స్విమ్మింగ్ చేసేటప్పుడు లేదా వర్షంలో తడిచినా సరే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వందకు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్ ఉండటం వల్ల ప్రతిరోజూ మీ డ్రెస్‌కు తగ్గట్టు లుక్‌ని మార్చుకోవచ్చు.
ధరల వివరాలు :
ఇది కేవలం ప్రస్తుతం రూ. 1,299 నుంచి రూ. 1,499 మధ్య లభిస్తోంది.