Xiaomi X Pro QLED: ఈ రోజుల్లో ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో సినిమాలు,వెబ్ సిరీస్‌లు చూసే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అయితే.. ఆ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలంటే ఒక నార్మల్ ఎల్‌ఈడీ టీవీ సరిపోదు.. దానికి ఒక లగ్జరీ క్యూఎల్ఈడీ స్క్రీన్ ఉండాల్సిందే! మన బడ్జెట్‌కు తగ్గ ధరలో.. అల్ట్రా-ప్రీమియం విజువల్స్ అందించడానికి ప్రముఖ బ్రాండ్ షావోమి తీసుకొచ్చిన సరి కొత్త మోడలే Xiaomi X Pro QLED 2025 (43-Inch). కేవలం రూ.30,999కే లభించే ఈ స్మార్ట్ టీవీ ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ టీవీ మార్కెట్లో షావోమి ఎప్పుడూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంటుంది. ఈసారి కూడా సుమారు 31 వేల బడ్జెట్‌లో ప్రీమియం QLED టెక్నాలజీని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చింది. 43 ఇంచుల సైజులో వచ్చే ఈ టీవీలోని టాప్ హైలైట్స్ ..
ఈ టీవీలోని స్పెషల్ అట్రాక్షన్ దీని క్యూఎల్ఈడీ స్క్రీన్. ఇది సాధారణ ఎల్‌ఈడీ టీవీల కంటే.. బిలియన్ పైగా రంగులను చాలా స్పష్టంగా చూపిస్తుంది. 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో ..పాటు డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ ఉండటం వల్ల నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో.. సినిమాలు చూస్తున్నప్పుడు థియేటర్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. దీని బెజెల్-లెస్ డిజైన్ మీ లివింగ్ రూమ్‌కి ఒక లగ్జరీ లుక్‌ని యాడ్ చేస్తుంది.
సినిమాకి విజువల్స్ ఎంత ముఖ్యమో.. సౌండ్ కూడా అంతే ముఖ్యం. Xiaomi X Pro QLED లో పవర్‌ఫుల్ స్పీకర్లను అమర్చారు. ఇవి డాల్బీ ఆడియో, DTS:X టెక్నాలజీతో పనిచేస్తాయి. దీని వల్ల డైలాగ్స్ చాలా క్లియర్‌గా వినిపించడమే కాకుండా.. బేస్ కూడా చాలా రిచ్‌గా ఉంటుంది. దీని కోసం మీరు విడిగా హోమ్ థియేటర్ సిస్టమ్ కొనాల్సిన అవసరం పెద్దగా ఉండదు.
Also Read: డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ, ఏఐ ట్రాన్స్‌లేషన్ సపోర్ట్. .మార్కెట్‌లో రచ్చ లేపుతున్న వన్ ప్లస్
ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. దీని ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా ఉంటుంది. మీ ఇష్టానికి తగినట్లుగా సినిమాలు, షోలను ఇది హోమ్ స్క్రీన్‌పైనే సజెస్ట్ చేస్తుంది. దీంతో పాటు షావోమి ప్రత్యేకమైన ‘ప్యాచ్‌వాల్’ ఫీచర్ కూడా ఉంది. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటూ లైవ్ ఛానెల్స్, ఓటీటీ కంటెంట్‌ను ఒకే చోట చూపిస్తుంది.
స్మార్ట్ కనెక్టివిటీ & పర్ఫార్మెన్స్ :
ఈ టీవీలో పవర్‌ఫుల్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. దీని వల్ల యాప్స్ చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. ఇందులో 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. మీ ప్లేస్టేషన్ లేదా సెట్-టాప్ బాక్స్‌ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ ద్వారా రిమోట్ బటన్స్ నొక్కకుండా కేవలం మీ వాయిస్‌తోనే టీవీని కంట్రోల్ చేయవచ్చు.
సుమారు రూ.30,000 బడ్జెట్‌లో ఒక నార్మల్ 4K టీవీ కొనడం కంటే, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న Xiaomi X Pro QLED 2025 (43-Inch) ని ఎంచుకోవడం చాలా స్మార్ట్ డీల్. తక్కువ ధరలో.. బెస్ట్ డిస్‌ప్లే, అదిరిపోయే సౌండ్, ప్రీమియం బ్రాండ్ వాల్యూ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.