E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన క్లైమేట్.. దంచికొడుతున్న వాన.. రాబోయే 2 గంటలు హైఅలర్ట్!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన క్లైమేట్.. దంచికొడుతున్న వాన.. రాబోయే 2 గంటలు హైఅలర్ట్!
Advertisement

Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకూ ఎండ, ఉక్కపోతతో నగరవాసులు అల్లాడగ.. సాయంత్రం ఒక్కసారిగా కారుమబ్బులు పలు ప్రాంతాలను కమ్మేశాయి. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి నగరాన్ని పెద్ద ఎత్తున మబ్బులు కమ్మేసి అహ్లాదకర వాతావరణాన్ని సృష్టించాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వర్షం మెుదలు కాగా.. రాబోయే రెండు గంటల్లో నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ భారీగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

35 రోజుల తర్వాత వర్షం..!

గత 35 రోజులుగా నగరంలో వర్షం లేదని పలువురు పేర్కొంటున్నారు. రాత్రి చల్లగా ఉన్నప్పటికీ పగటి వేళ మాత్రం భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఏపీలో వచ్చిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ లో వాతావరణం కాస్త చల్లబడింది. ఈ క్రమంలోనే సాయంత్రం నుంచి నగరంలో భారీ వర్షం మెుదలు కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆకాశానికి చిల్లుపడినట్లుగా..

Advertisement

ముఖ్యంగా నగరంలోని సరూర్‌నగర్, ఎల్‌బీ నగర్, నాగోల్, హయాత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షం పడుతోంది. చాలా రోజుల తర్వాత పడుతున్న ఈ వర్షాన్ని చూసి స్థానికులు సంతోషంగా ఉన్నప్పటికీ.. ట్రాఫిక్ సమస్య, రోడ్డన్నీ జలమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం.. బద్రీనాథ్ మార్గంలో కూలిన హెలికాప్టర్.. పైలెట్ సహా ఆరుగురు మృతి

నగరమంతటా వ్యాపిస్తున్న మేఘాలు

Advertisement

రాబోయే రెండు గంటల్లో ఈ కుండపోత వర్షం నగరంలోని ఇతర ప్రధాన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, మలక్‌పేట్, రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, నాచారం, మణికొండ, షేక్‌పేట్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వాటి పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!

 

Tags

Related News

నా చావుకి డాక్టర్లు, పోలీసులే కారణం.. అట్టముక్కపై సూసైడ్ నోట్ రాసి టెక్కీ ఆత్మహత్య!

ఏడాది తర్వాత వీడిన ఖమ్మం మర్డర్ మిస్టరీ.. చెప్పుల క్లూతో చిక్కిన కిల్లర్స్!

మియాపూర్ భూముల కేసులో ప్రభుత్వ గెలుపు.. KCR, KTRలపై విరుచుకుపడ్డ చనగాని దయాకర్

రూ.84,790 కోట్లతో భాగ్యనగరం రూపురేఖలు చేంజ్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిగ్ ప్లాన్!

మణిపూర్ పోకుండా ఇక్కడికెందుకొచ్చావ్? అమిత్ షాపై మంత్రి పొన్నం ఫైర్!

మియాపూర్ భూముల వ్యవహారం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, లక్షా 50 వేల కోట్ల భూములు కాపాడాం

సెల్‌ఫోన్ ఆ యువతికి శాపమైంది.. కూతుర్ని చంపిన తల్లి, రంగారెడ్డి జిల్లాలో ఘోరం

Big Stories

Advertisement
×