E-Paper
Advertisement

Smartphones Premier League: 5జీ ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్స్.. ఇప్పుడు రూ.10 వేల లోపే కొనేయొచ్చు!

Smartphones Premier League: 5జీ ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్స్.. ఇప్పుడు రూ.10 వేల లోపే కొనేయొచ్చు!
Advertisement

Smartphones Premier League Under Rs 10,000: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో అమెజాన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై డిస్కౌంట్లను అందిస్తోంది. వ్యక్తిగత ఉత్పత్తులపై డిస్కౌంట్లతో పాటు, ఆసక్తిగల కొనుగోలుదారులకు కంపెనీ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా మీ పాత ఫోన్‌ని రీప్లేస్ చేయాలనుకుంటున్నట్లయితే ఇదే మంచి ఛాన్స్. ఈ సేల్‌లో కేవలం రూ.10000ల లోపు లభించే బెస్ట్ 5జీ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

Redmi 13C 5G

Advertisement

రెడ్‌మి 13సి 5జీ (Redmi 13C 5G) స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని 4GB RAM, 128GB Storage అసలు ధర 10,499 ఉండగా.. ఇప్పుడు రూ.1000 కూపన్ తగ్గింపు అందిస్తోంది. దీంతో ఈ 5జీ ఫోన్‌ను రూ.9,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.9,750 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఇది లభిస్తుంది. ఇది గ్రీన్, సిల్వర్, బ్లాక్ కలర్ వేరియంట్లలో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌సెట్, 6.74-అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. వెనుక 50MP AI డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది.

Poco M6 Pro 5G

Advertisement

అమెజాన్‌లో పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్‌పై క్రేజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.15,999 ఉండగా ఇప్పుడు 41 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.9,499లకే లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు దీనిపై రూ.500 వరకు కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. అప్పుడు ఇది రూ.8,999లకే లభిస్తుంది. దీనిపై కూడా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Also Read: ది బెస్ట్ స్మార్ట్‌వాచ్ కొనుక్కోవాలనుకుంటే.. ఇదే మంచి అవకాశం.. వదులుకోకండి..!

ఏకంగా రూ.9000 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఇది లభిస్తుంది. ఇది గ్రీన్, బ్లాక్ కలర్ వేరియంట్లలో వస్తుంది. 6.79-అంగుళాల FHD+ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. వెనుక 50MP AI డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది.

Redmi 12 5G

రెడ్ మి 12 5జీ ఫోన్ అమెజాన్‌లో తక్కువ ధరకే ఉంది. దీని అసలు ధర రూ.15,999 కాగా ఇప్పుడు 25 శాతం డిస్కౌంట్‌తో రూ.11,999లకే లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు దీనిని మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీనిపై ఏకంగా రూ.1250 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో దీన్ని రూ.10,749లకే కొనుక్కోవచ్చు. అయితే రూ.10వేల లోపు ఫోన్లు అన్నాం కాబట్టి ఇక్కడ అదనంగా ఓ రూ.749లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

Tags

Related News

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Big Stories

Advertisement
×