BigTV English

Cop vehicle enters AIIMS emergency ward: సినిమా మాదిరిగా ఆసుపత్రిలో సీన్స్, నిందితుడు అరెస్ట్

Cop vehicle enters AIIMS emergency ward: సినిమా మాదిరిగా ఆసుపత్రిలో సీన్స్, నిందితుడు అరెస్ట్

Cop vehicle enters AIIMS emergency ward(Today’s news in telugu):

ప్రభుత్వ అధికారులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. మరికొన్ని చోట్ల పట్టించుకోరు. అలాంటి దగ్గర వారికి ఇబ్బందులు తెచ్చి పెట్టిన సందర్భాలు లేకపోలేదు. రుషికేశ్‌లోని ఎయిమ్స్‌లో పోలీసుల హంగామాను చూసి పేషెంట్ల హడలెత్తిపోయారు. ఒకానొక దశలో సినిమా షూటింగ్ జరుగుతుందేమోనని అనుకున్నారు. చివరకు ఆ విషయం తెలిసి షాకవ్వడం వారి వంతైంది. అసలేం జరిగింది?


రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రెండురోజుల కిందట ఓ సంఘటన జరిగింది. నర్సింగ్ డిపార్టుమెంట్‌ లోని ఓ పెద్దాయన, మహిళా డాక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అసభ్యంగా సైగలు చేస్తూ సందేశాలు పంపాడని డాక్టర్ ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో డాక్టర్‌కు మద్దతుగా మిగతా స్టాప్ నిలిచింది. చివరకు ఈ వ్యవహారం ఆందోళనకు దారితీసింది. డాక్టర్‌కు మద్దతుగా ఎయిమ్స్ ముందు తోటి డాక్టర్లు, సిబ్బంది నిరసనకు దిగారు. నిందితుడ్ని శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితి గమనించిన ఖాకీలు, తమ వాహనాన్ని నేరుగా అత్యవసర వార్డులో నుంచి తీసుకెళ్లారు. దీంతో పేషెంట్లు హడలిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి అంతా తెలుసు కున్నాక ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని అక్కడేవున్న పేషెంట్ బంధువు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై వెలుగులోకి వచ్చింది.


ALSO READ: హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్ పాజిటివ్.. ఆ ట్రాప్ లో పడనంటోన్న నటి

డాక్టర్ ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో ఆందోళనకారులు తమపై దాడి చేసే ప్రమాదం ఉందని భావించారు. వార్డులోని రోగుల బెడ్స్‌ను పక్కకు తప్పించి పోలీసు వాహనంలోనికి వెళ్లింది. తర్వాత నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సొంతూరు రాజస్థాన్. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యింది. జరిగిన వ్యవహారంపై కమిటీ వేసి దర్యాప్తు చేయాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరింది.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×