5G Smartphone Offer: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఇన్ఫినిక్స్ కొత్త మిడ్-రేంజ్ మోడల్ NOTE 50x 5G+ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ప్రొసెసర్, ఆకర్షణీయమైన డిజైన్, AI ఆధారిత ఫీచర్లతో ఈ ఫోన్ అత్యుత్తమ ప్రదర్శనను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 3, 2025 నుంచి Flipkartలో ప్రత్యేక ఆఫర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌గా కేవలం రూ.10,499కే ఈ ఫోన్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు.
అద్భుతమైన డిస్‌ప్లే & ఆడియో
NOTE 50x 5G+ లో 6.67-అంగుళాల HD+ పంచ్-హోల్ స్క్రీన్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్ అందిస్తుంది. DTS పవర్డ్ డ్యూయల్ స్పీకర్లు ఉన్నందున ఆడియో అనుభవం అద్భుతంగా ఉంటుంది.
కెమెరా ఫీచర్లు
ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. 12కిపైగా ఫోటోగ్రఫీ మోడ్స్ ఉంటాయి. 8MP సెల్ఫీ కెమెరా ఫ్రంట్ ఫ్లాష్, స్క్రీన్ ఫ్లాష్ తో వస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.
స్టైలిష్ డిజైన్ & బిల్డ్ క్వాలిటీ
-NOTE 50x 5G+ మూడు అద్భుతమైన ఫినిషింగ్‌లలో వస్తుంది:
-Sea Breeze Green (Vegan Leather Finish)
-Titanium Grey (Metallic Finish)
-Enchanted Purple (Metallic Finish)
-ఈ డివైస్ MIL-STD-810H సర్టిఫికేషన్ కలిగి ఉంది. IP64 రేటింగ్ కలిగి ఉంది. కాబట్టి నీటి, దుమ్ము నుంచి రక్షణ అందిస్తుంది. Active Halo Lighting ఫీచర్ నోటిఫికేషన్ల ద్వారా కాల్స్, ఛార్జింగ్ సమయంలో లైటింగ్ ఇస్తుంది.
Read Also: Smart TV Offer: 40 ఇంచ్ స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపు ఆఫర్..
శక్తివంతమైన బ్యాటరీ & ఛార్జింగ్
NOTE 50x 5G+ 5,500mAh సెమీ సాలిడ్ స్టేట్ బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా వేగంగా ఛార్జ్ అవుతుంది. 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇతర డివైస్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.
శక్తివంతమైన ప్రాసెసర్ & గేమింగ్ అనుభవం
NOTE 50x 5G+ MediaTek Dimensity 7300 ULTIMATE ప్రాసెసర్ తో వస్తుంది. 4nm ఆర్కిటెక్చర్ పై నిర్మితమైన ఈ చిప్ 90FPS వరకు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ మరింత మెరుగ్గా ఉంటాయి. Game Mode, Bypass Charging, MediaTek HyperEngine వంటి ప్రత్యేక ఫీచర్లు దీనిలో కలవు.
కొత్త XOS 15 & AI ఫీచర్లు
ఈ డివైస్ XOS 15 (Android 15 ఆధారంగా) పై రన్ అవుతుంది. On-Screen Awareness, AIGC Portraits, AI Note, Writing Assistant వంటి AI ఫీచర్లు అందించబడుతున్నాయి. Folax AI Voice Assistant, Circle వంటి ఫీచర్లు ఈ డివైస్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేస్తాయి.
ధర & వేరియంట్లు
-6GB RAM + 128GB స్టోరేజ్ (12GB వరకు ఎక్స్‌పాండబుల్): రూ. 11,499
-8GB RAM + 128GB స్టోరేజ్ (16GB వరకు ఎక్స్‌పాండబుల్): రూ. 12,999
-ICICI బ్యాంక్ కార్డ్స్ లేదా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.