E-Paper
Advertisement

Smart watch: బోట్ స్మార్ట్‌వాచ్ పై 85% తగ్గింపు ఆఫర్.. హార్ట్ ట్రాకింగ్ సహా కీలక ఫీచర్లు

Smart watch: బోట్ స్మార్ట్‌వాచ్ పై 85% తగ్గింపు ఆఫర్.. హార్ట్ ట్రాకింగ్ సహా కీలక ఫీచర్లు
Advertisement

Smartwatch: మీరు బడ్జెట్ ధరల్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీల కంపెనీ బోట్ ఓ వాచ్ ధర విషయంలో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ క్రమంలో Wave Fury మోడల్ వాచ్ అసలు ధర రూ. 6,999 కాగా, ప్రస్తుతం 85 తగ్గింపు ధరతో కేవలం రూ. 999కే అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

HD డిస్‌ప్లే

ఈ స్మార్ట్‌వాచ్‌ “బోట్ వేవ్ ఫ్యూరీ” మోడల్ 1.83 అంగుళాల HD డిస్‌ప్లే, బ్లూ టూత్ కాలింగ్, ఫంక్షనల్ క్రౌన్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ డిస్‌ప్లే అత్యంత స్పష్టమైన చిత్రాలు, వీడియోలను చూపిస్తుంది. దీంతోపాటు మీరు ఇమేజెస్ టెక్స్ట్‌ను కూడా బాగా చూడగలుగుతారు. ఈ ఫీచర్ ఫిట్‌నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, కాల్స్ వంటి వాటిని స్పష్టంగా ప్రదర్శించడంలో సహాయపడుతుంది.

బ్లూటూత్ కాలింగ్

Advertisement

బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీరు జస్ట్ మీ స్మార్ట్‌వాచ్‌తో బ్లూటూత్ ద్వారా కాల్ రెక్వెస్ట్ చేస్తే ఫోన్ వెళ్తుంది. కాల్ చేసినప్పుడు, మీరు బోట్ వేవ్ ఫ్యూరీ వాచ్‌ లో ఉన్న స్పీకర్‌ను ఉపయోగించి ప్రతిస్పందించవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఒక ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ కూడా ఉంది. ఒకవేళ మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగకరంగా పనిచేస్తుంది.

ఫంక్షనల్ క్రౌన్

బోట్ వేవ్ ఫ్యూరీ వాచ్‌లో ఉన్న ఫంక్షనల్ క్రౌన్ స్మార్ట్‌వాచ్‌ను మరింత ఉపయోగకరంగా మార్చుతుంది. ఈ క్రౌన్ స్మార్ట్‌వాచ్ నావిగేషన్‌ను మరింత సులభం చేస్తుంది. ఎందుకంటే మీరు క్లిక్ చేయడానికి మాత్రమే వాడే క్రౌన్ ద్వారా వాచ్‌లో మెనూలను స్క్రోలింగ్ చేయవచ్చు. ఇది క్లిక్ చేసినప్పుడు అవసరమైన ఫంక్షన్లను ఎంపిక చేస్తుంది.

Advertisement

Read Also: Smartphone Offer: రూ. 5 వేలకే మోటోరోలా 5జీ కొత్త ఫోన్.. ఎలాగో తెలుసా..

ఫిట్‌నెస్ ట్రాకింగ్ & ఆరోగ్య లక్షణాలు

బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ ఆరోగ్య, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌తోపాటు 100కి పైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్ట్ చేస్తుంది. వీటిలో హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్టెప్ కౌంటింగ్, కేలరీ బర్న్ ట్రాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా హార్ట్ రేట్ ట్రాకింగ్ ఉపయోగించి మీరు మీ హార్ట్ రేట్‌ని నిత్యం చెక్ చేసుకోవచ్చు. ఇది మీ ఆరోగ్య పర్యవేక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఆక్సిజన్ సెంట్రేషన్ (SpO2) సపోర్ట్ సౌకర్యాలను కూడా అందిస్తుంది. అంటే మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు.

బ్యాటరీ & ఛార్జింగ్

బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్‌లో పవర్‌పుల్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ ఒకే ఛార్జ్‌తో ఎక్కువ సమయం చేస్తుంది. సాధారణంగా ఇది దీని ఉపయోగంపై ఆధారపడి 7 నుంచి 10 రోజుల వరకు పని చేస్తుంది. వేగంగా ఛార్జింగ్ చేయడంతోపాటు మీరు ఛార్జ్ చేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది.

Tags

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×