Nithya Shetty : మనం చూసే ప్రతి సినిమా వెనకాల మనకు తెలియని తెర వెనుక కథలు ఎన్నో ఉంటాయి. అవి వింటుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి, మెగాస్టార్ చేయని జోనర్ అంటూ లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మెగాస్టార్ కెరియర్ లో కొన్ని సినిమాలకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవచ్చు. కానీ ఆ సినిమాలు ఇప్పుడు చూస్తున్నా కూడా అంత అద్భుతంగా ఎలా తీసారా అని అనిపిస్తూ ఉంటుంది. అలా మెగాస్టార్ కెరియర్ లో చేసిన సోషియా ఫాంటసీ సినిమా అంజి. ఈ సినిమాను కోడి రామకృష్ణ తెరకెక్కించారు. శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను దాదాపు ఆరేళ్లపాటు చిత్రీకరించారు.
ఈ సినిమాలో నిత్య శెట్టి బాలనటిగా నటించిన విషయం తెలిసిందే. దేవుళ్ళు సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్న నిత్య శెట్టి ఈ సినిమాలో నటించింది. రీసెంట్ గా నిత్య శెట్టి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు రకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలను పంచుకుంది. ఈ సినిమా ఎక్కువ శాతం అడవుల్లో జరుగుతుంది చాలా రోజులు పాటు సేమ్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తూ ఉంటారు. అలానే చిరంజీవి గారు అంజి సినిమాలో చాలా రోజులు ఒక షర్ట్ ని వాష్ చేయకుండా అలాగే వేసుకున్నారు. అని నిత్య శెట్టి రివీల్ చేసింది. మేమైతే చిన్నపిల్లలం కాబట్టి ఏమైనా వేసుకుంటాం కానీ ఆయన కూడా అలానే వేసుకోవడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఆఫ్ కెమెరా ఆయన ఎంత క్యాజువల్ గా ఉంటారో ఒక్కసారి కెమెరా పెట్టిన తర్వాత అలర్ట్ అవుతారంటూ పలు రకమైన ఆసక్తికర విషయాలను రివిల్ చేసింది.
Also Read : Rappa Rappa Fight Scene : రెజ్లింగ్‌లో రప్ప రప్ప ఫైట్… పుష్ప గాడి రేంజ్ ఇంటర్నేషనల్ అప్ప..
ఇక అంజి సినిమా విషయానికి వస్తే భగీరథుడు తన పూర్వీకులను బతికించడం కోసం ఆకాశ గంగను భూమి మీదకు తేవాలనుకుంటాడు. అయితే ఆ శక్తిని తట్టుకోవడం కోసం తన ఆత్మశక్తితో తయారు చేసిన ఆత్మలింగాన్ని భూమి మీద ప్రతిష్టింప జేస్తాడు శివుడు. అలా ఒక ప్రణవ మహాశివరాత్రి నాడు ఆకాశగంగ భూమికి దిగి వచ్చి ఆత్మలింగాన్ని అభిషేకిస్తూ కిందికి ప్రవహిస్తుంది. ఈ ఆత్మలింగం అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుంది. ప్రతి 72 ఏళ్ళకు (ఆరు పుష్కరాలు) ఒకసారి వచ్చే ప్రణవ మహాశివరాత్రికి, ఆకాశ గంగ స్వయంగా భూమికి దిగి వచ్చి ఆత్మలింగాన్ని అభిషేకిస్తుంది. ఆ సమయంలో ఆ పవిత్ర జలాన్ని సేవించిన వారికి మరణముండదు. నిత్య యవ్వనులవుతారు. వారికి అద్భుత శక్తులు ప్రాప్తిస్తాయి. ఆ పవిత్ర జలం కోసం ఎటువంటి సంఘర్షణలు జరిగాయి అనేది ఈ సినిమా కథ.
Also Read : Movie Theatres : థియేటర్‌లోకి పూల కుండీల ఎంట్రీ లేదు… పాపం ఫ్యాన్స్