ప్రస్తుతం మొబైల్ ఫోన్ మార్కెట్‌లో కూడా పోటీ భారీగా పెరిగింది. దీంతో ఆయా స్మార్ట్‌ఫోన్‌ల సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా తన g35 5G ఫోన్లపై క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోటోరోలా కొత్త మోడల్ G35 5G (లీఫ్ గ్రీన్, 128 GB) (4 GB RAM) అసలు ధర రూ. 12,499 కాగా, ప్రస్తుతం 20 శాతం తగ్గింపు ఆఫర్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 9,999కే అందుబాటులో ఉంది.
మోటోరోలా G35 5G ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. ఇది 6.5 అంగుళాల LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ ను కల్గి ఉంది. ఇది స్మూత్ స్క్రోలింగ్, వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ రంగులను స్పష్టంగా చూపించడంలో సహాయపడుతుంది. లీఫ్ గ్రీన్ రంగులో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ప్రాసెసర్, స్టోరేజ్: మోటోరోలా G35 5G ఫోన్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ ఫోన్‌లో 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు సౌలభ్యాన్ని బట్టి యాప్స్, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు.
5G కనెక్టివిటీ: ఈ ఫోన్ ముఖ్యంగా 5G కనెక్టివిటీతో వస్తుంది. భారత్‌లో 5G సేవలు ప్రారంభమైన తరుణంలో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మోటోరోలా G35 5G-లో 5G మద్దతు కలిగిన ఫీచర్ ఉండటం, వినియోగదారులు భవిష్యత్తులో వేగవంతమైన డేటా కనెక్షన్‌ను పొందగలుగుతారు.
కెమెరా: మోటోరోలా G35 5G ఫోన్‌లో 48MP ప్రధాన కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరా కలదు. ఇది వీడియో కాల్స్, సెల్ఫీలకు సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ: ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది దాదాపు ఒకరోజు మొత్తానికి సరిపోతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మీరు ఎక్కువగా ఫోన్‌ను వినియోగించినా లేదా ఫోటోలు, వీడియోలు తీసినా ఒకరోజు వస్తుందన్నారు. ఈ ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం కూడా కలదు.
సాఫ్ట్‌వేర్: మోటోరోలా G35 5G ఫోన్‌లో క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. అంటే Android 11 ఆధారంగా నిర్మితమైన సాఫ్ట్‌వేర్ నిర్మాణంలో అధికంగా అకడమిక్ అప్లికేషన్లు ఉండవు. ఇది యూజర్లు వేగవంతమైన, స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది.
బడ్జెట్ కేటగిరీలో ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో వస్తుండటం విశేషం. దీంతోపాటు మంచి RAM, ఆకర్షణీయమైన డిజైన్ వంటి అనేక ఫీచర్లు దీనిలో ఉన్నాయి. అంతేకాదు ఈ ఫోన్ తీసుకునే సమయంలో మీ వద్ద ఎదైనా పాత ఫోన్ ఉంటే దానిని ఎక్సైంజ్ చేస్తే మీకు మరింత తగ్గింపు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు పాత సామ్ సంగ్ ఏ14 ఫోన్ ఎక్సైంజ్ చేసి, మీరు కొత్త మోటోరోలా G35 కొనుగోలు చేస్తే మీకు దాదాపు రూ. 4 వేలకుపైగా తగ్గింపు లభిస్తుంది. అంటే మీరు రూ. 9,999 చెల్లించే బదులుగా కేవలం రూ. 5,589 చెల్లించి కొత్త ఫోన్ తీసుకోవచ్చు. ఈ క్రమంలో ఫోన్ మోడల్ ఆధారంగా ఎక్సైంజ్ మొత్తాన్ని తగ్గింపు చేస్తారు. ఈ ఆఫర్ ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంది.