E-Paper
Advertisement

Earthquakes:- సముద్ర లోతుల్లో రంధ్రం.. భూకంపాలకు సంకేతం..

Earthquakes:- సముద్ర లోతుల్లో రంధ్రం.. భూకంపాలకు సంకేతం..
Advertisement

Earthquakes:– సముద్రంలో నీళ్లు అనేవి ఎక్కువ ఇంకిపోవు, ఎండిపోవు. అలాంటివి జరిగినా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి. సముద్రం లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయని నిపుణులు అంటుంటారు. అందుకే దాని లోతులో ఎక్కువగా స్టడీ చేయడం కష్టమని కూడా చెప్తుంటారు. అయితే అలాంటి ఒక మిస్టరీ ఒకటి అమెరికాలోని సముద్రం నుండి బయటపడింది. దాని గురించి చెప్తూ శాస్త్రవేత్తలు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.

అమెరికాలోని ఒరెగాన్ అనే స్టేట్‌లోని సముద్రం లోతుల్లో లీక్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఒక పెద్ద రంధ్రాన్ని వారు గుర్తించారు. దీని వల్ల ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు రానున్నాయని వారు అంచనా వేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా దీని వల్ల భారీ భూకంపం పెసిఫిక్ నార్త్‌వెస్ట్‌ను అల్లకల్లోలం చేయనుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం పలుమార్లు భూకంపం దాటికి గురయ్యిందని, సముద్రం లోతుల్లో బయటపడిన ఈ రంధ్రం కూడా భారీ భూకంపానికి సంకేతాన్ని ఇస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

Advertisement

మామూలుగా సముద్రం లోతుల్లో ఉండే రంధ్రాలను ‘పయాథియాస్ ఒయాసిస్’ అంటారు. సముద్రంలోని నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఇలాంటి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అనుమానించినా.. అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి అని చెప్పడానికి ప్రత్యేకమైన ఆధారాలు ఏమీ లేవు. సముద్రం లోతుల్లో ఏర్పడిన ఇలాంటి రంధ్రాలపైన చమురు లాగా ఏర్పడుతుంది. ఆ చమురు అనేది పోయిన తర్వాత జరిగే ప్రమాదం గురించి ఎవరూ అంచనా వేయలేరని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఇదివరకు సముద్ర రంధ్రాల్లో నుండి నీటి బుడగలు రావడం శాస్త్రవేత్తలు గమనించారు. ఈ బుడగలు ఎందుకు వస్తున్నాయో కనుక్కోవడం కోసం వారు ఒక రోబోను నీటిలోకి పంపించారు. సముద్రంలోని వేడి వల్ల మాత్రమే అవి ఏర్పడుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. వారు చూసినవి మిథేన్ బుడగలే అయినా కూడా చాలా ఎక్కువ మోతాదులో అవి బయటికి రావడాన్ని గమనించారు. అయితే ఇలాంటివి వారు ముందెన్నడూ చూడలేదని, వారికి తెలిసినంత వరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

సముద్రం లోతుల్లోని రంధ్రం నుండి వచ్చే నీరు వెచ్చగా ఉందని శాస్త్రవేత్తలు గమనించారు. ఇది నేరుగా సముద్రంలోని భూభాగం నుండి వస్తున్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. దీనికి, భూకంపాలకు సంబంధం ఏంటంటే.. సముద్రంలో ఉండే ప్రెజర్ ఎప్పటికప్పుడు బయటికి విడుదల అవ్వాలి. అలా జరగనప్పుడు ఆ ప్రెజర్ అంతా ఒకేసారి బయటికి అనుకోకుండా వచ్చేస్తుంది. ఈ రంధ్రం వల్ల సముద్రంలో ప్రెజర్ ఎక్కువవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×