January 2025 Mobiles : స్మార్ట్ జాతర రేపటి నుంచే మొదలుకానుంది. ఈ జాతరలో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టాప్ 4 మొబైల్స్ ఈ వారంలోనే రాబోతుండటంతో టెక్ ప్రియులు తెగ సంబరపడిపోతున్నారు.
టెక్ ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్ ప్లస్ 13 సిరీస్, ఒప్పో రేనో 13 సిరీస్, రెడ్ మీ 14 C, మోటో G05 మొబైల్స్ ఈ వారంలోనే మార్కెట్లోకి లాంఛ్ కాబోతున్నాయి. ఈ మొబైల్ ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్, ధర, లాంఛ్ డేట్ ల పై ఓ లుక్కేయండి.
OnePlus 13 Series – ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్ తన ఫ్లాగ్ షిప్ సిరీస్ ను భారత్ లో లాంఛ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరి 7న వన్ ప్లస్ 13 సిరీస్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. ఇందులో వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13R మొబైల్స్ రాబోతున్నాయి. ఇక ఈ రెండు మొబైల్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. OnePlus 13 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, IP68, 6000mAh బ్యాటరీతో వచ్చేస్తుంది. అమెజాన్ లో ఈ మెుబైల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 12GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 53,100, 12 GB+512 GB మోడల్ ధర రూ.57,900, 16 GB+512 GB మోడల్ ధర రూ.62,600, 24 GB+1TB టాప్ వేరియంట్ ధర రూ.70,900 ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
Redmi 14C 5G –
Redmi 14C 5G స్మార్ట్‌ఫోన్ జనవరి 6న ఇండియాలో లాంఛ్ కాబోతుంది. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది మూడు రంగులలో రాబోతుంది. నీలం, నలుపు, ఊదా కలర్స్ లో ఆకట్టుకోనుంది. ఇందులో డ్యూయల్ 5G SIM సపోర్ట్, 50MP ప్రైమరీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్ సెట్ ఉండనుంది. దీంతో పాటు 6.88 అంగుళాల LCD డిస్‌ప్లే కూడా ఉంటుంది. Redmi 14C ధర రూ. 12,000 ఉండే అవకాశం ఉండనుంది.
Oppo Reno 13 Series –
టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన ఫ్లాగ్ షిప్ లో Oppo Reno 13 series ను లాంఛ్ చేయబోతుంది. ఇందులో రెండు మెుబైల్స్ రాబోతున్నాయి. జనవరి 9న ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13R లాంఛ్ కాబోతున్నాయి. ఒప్పో రెనో 13 లో కెమెరా ఫీచర్స్ సైతం అధునాతనంగా ఉన్నాయి. 50Mp పెరీస్కోప్ టెలీలెన్స్, ఆప్టికల్ జూమ్ సిస్టమ్ కూడా ఉండనున్నాయి. 80W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్, 5900mah బ్యాటరీకు ఈ మెుబైల్ సపోర్ట్ చేస్తుంది.
Moto G05 –
మోటో జనవరి 7న Moto G05 పేరుతో కొత్త మొబైల్ ను లాంఛ్ చేయబోతుంది. అతి తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ తో ఈ మొబైల్ వచ్చేస్తుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5200mAh బ్యాటరీతో రాబోతుంది. ఇక ధర రూ. 6,999గా ఉండటంతో.. రూ.10వేలలోపే కొనగలిగే బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా ఈ మెుబైల్ నిలవనుంది.
ALSO READ : హోండా మిడ్ రేంజ్ కార్స్.. కెవ్వుమనే ఫీచర్స్ తో జనవరి 7న మార్కెట్లోకి!