BigTV English

Samantha: అన్నీ అందరికీ చెప్పుకోకపోవడమే మంచిది.. ఫీలింగ్స్ దాచేసుకుంటున్న సమంత

Samantha: అన్నీ అందరికీ చెప్పుకోకపోవడమే మంచిది.. ఫీలింగ్స్ దాచేసుకుంటున్న సమంత

Samantha: సినీ సెలబ్రిటీలు.. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్ల పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. వారు ఇన్‌డైరెక్ట్‌గా ఏదైనా కామెంట్ చేసినా కూడా దానిని వేరే విషయాలతో కనెక్ట్ చేసి చూస్తుంటారు. చాలావరకు ఇలాంటి విషయాలపై హీరోలు, హీరోయిన్లు స్పందించరు. ఇక హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పుడు సమంత పర్సనల్ లైఫ్‌పై ఇంతగా ఫోకస్ లేదు. కానీ నాగచైతన్యతో పెళ్లి, విడాకుల తర్వాత మాత్రం తన సోషల్ మీడియాపై, పర్సనల్ లైఫ్‌పై నెటిజన్ల ఫోకస్ పెరిగింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత షేర్ చేసిన కోట్ కూడా అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేస్తోంది.


ఫీలింగ్స్ దాచేసుకుంటుందా.?

మామూలుగా తమ జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి హీరో, హీరోయిన్లు అంతగా ఇష్టపడరు. కానీ కొన్ని సందర్భాల్లో షేర్ చేసుకోక తప్పదు. అలాగే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియా పోస్టులను చాలామంది నెటిజన్లు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఎన్నో కోట్స్ పెడుతూ ఇవన్నీ తన పర్సనల్ లైఫ్ గురించి తను ఇన్‌డైరెక్ట్‌గా షేర్ చేసుకుంటున్న విషయాలేమో అని అందరికీ డౌట్ వచ్చేలా చేస్తుంది. ఇక 2025 ప్రారంభమయినా కూడా సమంత ఇలాంటి కోట్స్ షేర్ చేయడం ఆపలేదు. తాజాగా తను షేర్ చేసిన కోట్ చూస్తుంటే సమంత తన ఫీలింగ్స్ అన్నీ దాచేసుకుంటుందని అర్థమవుతోంది.


Also Read: ‘కుబేర’ కోసం చాలా మారిపోయిన శేఖర్ కమ్ముల.. కెరీర్‌లోనే మొదటిసారి అలా.!

సీరియస్‌గా ఆలోచించాల్సిందే

‘మీరు ప్రపంచానికి ఎంత తక్కువ చెప్తే.. ఈ ప్రపంచం మీకు అంత మంచిగా కనిపిస్తుంది’ అనే కోట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సమంత (Samantha). అంతే కాకుండా దీనిని సీరియస్‌గా ఆలోచించాల్సిందే అంటూ ఈ కోట్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సామ్. దీన్ని బట్టి చూస్తే సమంత తన ఫీలింగ్స్‌ను దాచేస్తుందా అనే డౌట్ మొదలయ్యింది. చాలాకాలంగా సమంత సోషల్ మీడియాలో ఇలాంటి కోట్స్ తప్పా పెద్దగా తన ప్రొషెషనల్ లైఫ్‌కు సంబంధించిన అప్డేట్స్ ఏమీ కనిపించడం లేదు. మయాసైటీస్ వల్ల ఎఫెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాతి నుండి సినిమాలు చేయడం చాలావరకు తగ్గించేసింది.

సినిమాల్లో స్లో

సమంత చివరిగా వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘సిటాడెల్ హనీ బన్నీ’తో ప్రేక్షకులను పలకరించింది. అందులో మొదటిసారి యాక్షన్‌ను ట్రై చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సామ్ ఖాతాలో మరొక హిట్ చేరేలా చేసింది. కానీ అందులో వరుణ్ ధావన్‌తో కలిసి తను చేసిన రొమాన్స్‌పై ప్రేక్షకుల్లో నెగిటివిటీ కూడా ఏర్పడింది. ప్రస్తుతం సామ్ తన తరువాతి సినిమాల గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ షేర్ చేసుకోవడం లేదు. అందుకే సమంతను మళ్లీ ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అసలు సమంత సినిమాలు ఒప్పుకోవడం లేదా తన దగ్గరకు ఆఫర్లు రావడం లేదా అనేది ఆడియన్స్‌లో పెద్ద డౌట్‌గా మిగిలిపోయింది.

Samantha Instagram Story
Samantha Instagram Story

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×