Airtel Postpaid: భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ యూజర్లకు బంపరాఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 8 నుండి కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా ప్రతీ ఏడాది ఒక ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను అందించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
ఎయిర్ టెల్ యూజర్లకు విదేశాలకు వెళ్లినప్పుడు ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ద్వారా ఐదు రోజుల పాటు ఫ్రీగా రోమింగ్ ప్యాక్‌ను పొందనున్నారు. ఇందులో 5 జీబీ డేటా, 60 నిమిషాల కాలింగ్ (ఇన్‌కమింగ్ అండ్ అవుట్‌గోయింగ్), 25 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్ పాటు ఫ్రీ ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. విదేశీ ప్రయాణంలో తమకు కావలసిన సమయంలో ఈ 5 రోజుల ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకునే సదుపాయాన్ని ఎయిర్‌టెల్ కల్పించనుంది.
ఫ్యామిలీ ప్లాన్ తీసుకునేవారికి ఈ ఆఫర్ మరింత బెనిఫిట్ ను అందిస్తుందని ఎయిర్ టెల్ పేర్కొంది. ఈ ప్లాన్‌లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి (ప్రతి సిమ్‌కు) సంవత్సరానికి ఒక ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అక్టోబర్ 8 నుండి కొత్త కస్టమర్లతో పాటు ప్రస్తుతం ఉన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, ఇతర నెట్‌వర్క్ వినియోగదారులు ‘ఎయిర్‌టెల్ యాప్’ లేదా సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించి ఈ కొత్త ప్లాన్లలోకి మారవచ్చని సూచించింది.
ఎయిర్ టెల్ కొత్త పోస్ట్‌పెయిడ్ పోర్ట్‌ఫోలియోలో వ్యక్తిగత ప్రీపెయిడ్ (ఒక్కరికి) ప్లాన్ ధర రూ.499 నుండి ప్రారంభం కానుంది. ఇక ఫ్యామిలీ ప్లాన్ల విషయానికి వస్తే.. రూ.749 (2 సిమ్స్), రూ.1049 (3 సిమ్స్), రూ.1249 (3 సిమ్స్), రూ.1,249, రూ.1449 ప్లాన్లపై 4 సిమ్ లు ఇవ్వనున్నారు. ఇక ప్రీమియం పోస్ట్ పెయిడ్ ప్లాన్ అయిన రూ.1,799కి 5 సిమ్ లను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. పైన పేర్కొన్న ప్లాన్లన్నింటిలో అపరిమిత డేటా, ఉచిత కాల్స్, స్పామ్, ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్లు ఉచితంగా యూజర్లకు లభించనున్నాయి. అలాగే ఉచిత ఓటీటీలు, యాపిల్ ఐక్లోడ్+ సేవలను సైతం ఫ్రీగా యూజర్లు పొందొచ్చు.
Also Read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..వాషింగ్ మెషీన్లపై అదిరిపోయే డిస్కౌంట్‌లు!
పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయంలో ఎయిర్ టెల్ ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే మెరుగైన సేవలు అందిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ, నెట్‌వర్క్ ఫీచర్లతో పోస్ట్‌పెయిడ్‌ను బలోపేతం చేసిన ఎయిర్‌టెల్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ రోమింగ్‌ను చేర్చడం ద్వారా యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇస్తున్నామని మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి తెలిపారు. ఈ ఏడాది మే నెలలో లాంచ్ చేసిన ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ (Priority Postpaid)’, ఫాస్ట్ లేన్ టెక్నాలజీతో కూడిన 5G నెట్‌వర్క్ స్లైసింగ్ ఈ కొత్త ప్లాన్లలోనూ కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.
Also Read: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మూడేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై ఆర్థిక భారం