E-Paper
Advertisement

Airtel మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.489 కే 77 రోజుల వ్యాలిడిటీ.. నాన్ స్టాప్ కాల్స్, డేటా!

Airtel మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.489 కే 77 రోజుల వ్యాలిడిటీ.. నాన్ స్టాప్ కాల్స్, డేటా!
Advertisement

Airtel Plan: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎప్పకప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్స్ ను తీసుకొస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బడ్జెట్ యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్ అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం రూ. 489 ప్లాన్ తీసుకొచ్చింది. తక్కువ ధరలో 77 రోజుల లాంగ్ వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.489 ప్లాన్ వివరాలు..

ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 77 రోజుల ప్లాన్ తో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్లాన్ మెుత్తం కాలానికి 600 ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు. ఇక డేటా విషయానికి వస్తే.. వ్యాలిడిటీ కాలానికి 6GB మాత్రమే లభించనుంది. ఈ డేటాను 77 రోజుల్లో ఎప్పుడైనా, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు.

అదనపు బెనిఫిట్స్

Advertisement

కాలింగ్, డేటాతో పాటు ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌పై కొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం యూజర్లకు అందిస్తోంది. హెల్త్‌కేర్ సేవలకు సంబంధించి 3 నెలల ఉచిత ‘అపోలో 24/7 సర్కిల్’ సభ్యత్వం ఆఫర్ చేస్తోంది. దాంతోపాటు ‘వింక్ మ్యూజిక్’ యాప్ ద్వారా మీకు నచ్చిన పాటలను ఉచితంగా హలో ట్యూన్స్‌గా సెట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

ఈ ప్లాన్ వల్ల ఎవరికి లాభం?

ఇంట్లో లేదా ఆఫీసులో వైఫై అందుబాటులో ఉండి.. మెుబైల్ డేటాతో పెద్దగా పనిలేదనుకునేవారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. అలాగే ఎయిర్‌టెల్ సిమ్ ను కేవలం ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కోసం మాత్రమే భావించే వారికి ఇది సెట్ అవుతుంది. అదే విధంగా ఆత్మీయులతో నిరంతరాయంగా మాట్లాడటానికి ఫోన్ ఉపయోగించే వృద్ధులకు, గ్రామీణ వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. అత్యంత చౌకగా లభించే.. టాప్-5 ఖరీదైన ఫోన్లు ఇవే!

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

ఈ ప్లాన్‌ను చాలా సులభంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ను ఓపెన్ చేసి.. రీఛార్జ్ సెక్షన్‌లో రూ. 489 ప్లాన్‌ను ఎంచుకుని యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయెుచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ అయినా గుగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీయంలోని రీఛార్జ్ సెక్షన్ వెళ్లి కూడా ఎయిర్ టెల్ ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు. ఆన్ లైన్ రీఛార్జ్ వీలుపడని పక్షంలో దగ్గరలోని ఎయిర్ టెల్ స్టోర్, రీటైల్ షాపు వద్దకు వెళ్లైనా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

Also Read: రూ. 3 వేల కోట్ల స్కామ్.. ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. షాకైన విశాఖ వైసీపీ నేత విజయప్రసాద్‌

Tags

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×