Big Stories

Airtel Unlimited Plan @ Rs 49 Only: జస్ట్ రూ.49తో అన్ లిమిటెడ్ డేటా.. ఎయిర్‌టెల్ యూజర్లకు క్రేజీ ఆఫర్

airtel
airtel

Airtel Unlimited Plan with Rs 49 Only: యూజర్లకు ఎయిర్ టెల్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది. రూ. 49లకు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది. ఇప్పటి వరకు రూ. 49కు కేవలం 6 జీబీ డేటా మాత్రమే ఉండేది.. కానీ ప్రస్తుతం దీనిని అన్ లిమిటెడ్ డేటా ప్యాక్ కింద కన్వర్ట్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఎయిర్ టెల్ ప్లాన్లలో ఇదే అతి తక్కువ ధర గల బెస్ట్ అన్ లిమిటెడ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఈ మేరకు యూజర్లకు శుభవార్త అంటూ ప్రకటించింది. అయితే మార్కెట్లో జియెకు పెరుగుతున్న ఆదరణతో ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లను యూజర్ల ముందుకు తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే రూ. 49 లకు అన్ లిమిటెడ్ డేటాను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

ఎయిర్ టెల్ అందిస్తున్న ఈ ప్యాక్ తో అన్ లిమిటెడ్ డేటాను పొందవచ్చు. తొలుత 6జీబీ మాత్రమే ఉన్న ఈ ప్లాన్ లో ఇప్పుడు 20జీబీ డేటాను వాడుకోవచ్చు. అంతేకాదు. ఈ ప్యాక్ వేసుకున్న వారికి 64kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. అంటే 1GB డేటా ధర రూ. 2.45లకు మాత్రమే ఎయిర్ టెల్ అందిస్తుందని అర్థం. ఈ ప్యాక్ ఇంతకముందు కేవలం ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు డేటాను ఎక్కువ మోతాదులో యూజర్లకు అందిచడం ద్వారా దీని ప్రయోజనాలను పెంచేందుకు ఎయిర్ టెల్ సంస్థ కసరత్తు చేస్తోంది. జియో వొడాఫోన్ ప్లాన్లకు ధీటుగా ఎయిర్టెల్ యూజర్లకు ఆఫర్లను ప్రకటిస్తోంది.

- Advertisement -

ఎయిర్ టెల్ యూజర్లకు అందిస్తున్న రూ.49 ప్లాన్ తర్వాత ఇలాంటివి రెండు ప్లాన్లను ఎయిర్ టెల్ అందిస్తోంది. దీని ద్వారా యూజర్లు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీని పొందనున్నారు. మరోవైపు ఎయిర్ టెల్ వద్ద మరో ప్లాన్ కూడా ఉంది. రూ.99లకే అన్ లిమిటెడ్ ప్లాన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ కు రెండు రోజుల పాటు వ్యాలిడిటీ ఉండనుంది.

Also Read: Get 5G Smart Phone Under Rs 10,000: రూ. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్లు.. అమెజాన్ హోలీ సేల్స్‌లో ఆఫర్లే ఆఫర్లు..!

రూ. 699, రూ. 701లకే జియో, వొడాఫోన్ కంపెనీలు పోస్ట్ పెయిడ్ ప్లాన్ల్ అందిస్తున్నాయి. రూ. 699లకే జియో యూజర్లకు 100 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 100 ఎస్ఎంఎస్ ల ప్యాక్ ను అందిస్తుంది. ఈ ప్లాన్లో యూజర్లకు జియో బెస్ట్ ఆఫర్ ఇచ్చింది. ఇందులో మూడు సిమ్ లను అదనంగా వాడుకోవచ్చని తెలిపింది. మరోవైపు రూ. 710లకే వొడా ప్లాన్ ఉంది. అన్ లిమిటెడ్ కాల్, 1 నెల అన్ లిమిటెడ్ డేటా, ప్రతీ రోజు 100 ఎంఎంఎస్ లను ఈ ప్యాక్ లో అందిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News