BigTV English
Advertisement

Amazon Alexa Safety: అలెక్సా అన్నీ వింటోంది.. ఇంట్లో స్మార్ట్ డివైజ్‌లుంటే ఈ జాగ్రత్తలు పాటించండి

Amazon Alexa Safety: అలెక్సా అన్నీ వింటోంది.. ఇంట్లో స్మార్ట్ డివైజ్‌లుంటే ఈ జాగ్రత్తలు పాటించండి

Amazon Alexa Safety| అమెజాన్ అలెక్సా స్పీకర్లు చాలా స్మార్ట్. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండడంతో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ డివైజ్‌లు మీకు ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేయడం, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం వంటివి చేస్తాయి. కానీ.. ప్రైవెసీ, డేటా సెక్యూరిటీ గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. “అలెక్సా ఎల్లప్పుడూ వింటుందా?” అని కొందరు అడుగుతున్నారు. అలెక్సా తన “వేక్ వర్డ్” విన్నప్పుడు మాత్రమే యాక్టివ్ అవుతుంది, కానీ ఇది మైక్రోఫోన్‌తో ఉన్న పరికరం కాబట్టి, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సంభాషణలను రికార్డ్ చేయవచ్చు. అలెక్సాను సురక్షితంగా ఉపయోగించడానికి, మీ గోప్యతను రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.


అలెక్సా స్మార్ట్ స్పీకర్‌ను సురక్షితంగా ఉపయోగించడానికి 7 ఈజీ టిప్స్ మీ కోసం

  1. మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయండి: అలెక్సా ఎకో స్పీకర్‌లో మ్యూట్ బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే అలెక్సా వినడం ఆగిపోతుంది. ప్రైవేట్ సంభాషణల సమయంలో లేదా అలెక్సా అవసరం లేనప్పుడు ఈ బటన్‌ను ఉపయోగించండి. ఎరుపు రింగ్ లైట్ కనిపిస్తే, అలెక్సా వినడం లేదని ధృవీకరణ అవుతుంది.
  2. వేక్ వర్డ్‌ను మార్చండి: కొన్నిసార్లు “అలెక్సా” లాంటి పదం సంభాషణలో వినిపిస్తే, అది యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అలెక్సా యాప్‌లో వేక్ వర్డ్‌ను “ఎకో,” “అమెజాన్,” లేదా “కంప్యూటర్”గా మార్చవచ్చు. ఇది అనుకోకుండా యాక్టివ్ కాకుండా నిరోధిస్తుంది.
  3. వాయిస్ రికార్డింగ్‌లను తొలగించండి: అమెజాన్ మీ వాయిస్ సంభాషణలను సేవ్ చేస్తుంది. దీన్ని తొలగించడానికి, అలెక్సా యాప్‌లో సెట్టింగ్స్ > ప్రైవసీ > మేనేజ్ యువర్ అలెక్సా డేటాకు వెళ్లి, “డిలీట్ రికార్డింగ్స్ మాన్యువల్‌గా” ఎంచుకోండి లేదా 3 లేదా 18 నెలలకు ఆటో-డిలీట్ సెట్ చేయండి. లేదా “అలెక్సా, నేను ఇప్పుడు చెప్పినది డెలీజ్ చేసెయి!” అని చెప్పవచ్చు.
  4. “Improve Alexa” ఆప్షన్ ఆఫ్ చేయండి: అలెక్సా మీ వాయిస్ రికార్డింగ్‌లను విశ్లేషించి మెరుగుపరుస్తుంది. ఇది మీకు సరిపడకపోతే, అలెక్సా యాప్‌లో సెట్టింగ్స్ > అలెక్సా ప్రైవసీ > మేనేజ్ యొర అలెక్సా డేటాకు వెళ్లి “యూజ్ వాయిస్ రికార్డింగ్స్ టు ఇంప్రూవ్ అమెజాన్ సర్వీసెస్” ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
  5. కనెక్టెడ్ స్కిల్స్‌ను సమీక్షించండి: థర్డ్ పార్టీ “స్కిల్స్” కొన్ని డేటాకు యాక్సెస్ కలిగి ఉంటాయి. అలెక్సా యాప్‌లో మోర్ > స్కిల్స్ & గేమ్స్ > యొర స్కిల్స్‌కు వెళ్లి అవసరం లేని స్కిల్స్‌ను తొలగించండి.
  6. అమెజాన్ ఖాతాను సురక్షితం చేయండి: అలెక్సా మీ అమెజాన్ ఖాతాకు లింక్ అయి ఉంటుంది. బలమైన పాస్‌వర్డ్ ఉపయోగించి, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ఆన్ చేయండి. ఇది అనధికార యాక్సెస్‌ను నిరోధిస్తుంది.
  7. అలెక్సాను సరైన ప్రదేశంలో ఉంచండి: అలెక్సాను బెడ్‌రూమ్, బాత్‌రూమ్ వంటి ప్రైవేట్ ప్రదేశాల్లో కాకుండా, లివింగ్ రూమ్, కిచెన్ వంటి సాధారణ ప్రాంతాల్లో ఉంచండి. ఇది గోప్య సంభాషణలను రికార్డ్ కాకుండా చేస్తుంది.

Also Read: Also Read: గూగుల్ ఏఐ మోడ్‌తో వెబ్‌సైట్లకు చాలా ప్రమాదకరం.. నిపుణుల వార్నింగ్


అలెక్సా చాలా సౌకర్యవంతమైన అసిస్టంట్ అయినప్పటికీ, ఇది ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన పరికరం. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ సెట్టింగ్స్ మార్చడం, దాని సామర్థ్యాల గురించి అవగాహన కలిగి ఉండడం ద్వారా మీరు అలెక్సా సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు, మీ ప్రైవీసీని కూడా కూడా రక్షించుకోవచ్చు.

Related News

Money saving tips: ఖర్చులు తగ్గించుకుని, డబ్బులు ఆదా చేయాలా? ఈ యాప్స్ మీ కోసమే, ట్రై చేయండి!

Perplexity Browser: ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ కామెట్ బ్రౌజర్.. గూగుల్‌కు చెమటలు పట్టిస్తోన్న పర్‌ ప్లెక్సిటీ!

Motorola Edge 60 5G Sale: అమేజింగ్ ఆఫర్స్ తమ్ముడూ.. మోటరోలా 5G ఫోన్‌ కొనడానికి ఇదే బెస్ట్ ఛాన్స్!

Elon Musk Photo To Video: ఒక్క క్లిక్‌తో ఫోటోను వీడియోగా మార్చేసే ట్రిక్.. ఎలాన్ మస్క్ ట్విట్ వైరల్

Emojis: ఎప్పుడైనా ఆలోచించారా.. ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకుంటాయో?

Japanese Helmet: ముఖం మీద ఫోన్ పడేసుకుంటున్నారా? ఇదిగో జపాన్ గ్యాడ్జెట్, మీ ఫేస్ ఇక భద్రం!

APK Files: ఏదైనా లింక్ చివరన apk అని ఉంటే.. అస్సలు ఓపెన్ చేయొద్దు, పొరపాటున అలా చేశారో..

Realme Discount: 50 MP ట్రిపుల్ కెమెరా గల రియల్‌‌మి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ15000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Big Stories

×