E-Paper
Advertisement

మల్టీటాస్కింగ్ అదరగొట్టాలా? అయితే.. ఈ 5 లెనోవో ల్యాప్‌టాప్స్ మీ కోసమే!

మల్టీటాస్కింగ్ అదరగొట్టాలా? అయితే.. ఈ 5 లెనోవో ల్యాప్‌టాప్స్ మీ కోసమే!
Advertisement

Lenovo 16GB RAM laptops Amazon: ఆఫీస్ పనిలో వేగం తగ్గకుండా.. క్షణాల్లో టార్గెట్ పూర్తి చేయాలంటే  మీ ల్యాప్‌ టాప్‌కు ఎక్కువ పవర్ అవసరం. ఇదిలా ఉంటే  8GB ర్యామ్ రోజులు పోయాయి, ఇప్పుడు అంతా.. 16GB RAM యుగం! డేటా అనాలిసిస్, కోడింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు చిటికెలో పూర్తి చేయడానికి లెనోవో ల్యాప్‌టాప్స్ సరి కొత్త ప్రమాణాలను సెట్ చేస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ సేల్స్ , ఆఫర్లలో లభిస్తున్న బెస్ట్ లెనోవో 16 జీబీ ర్యామ్ ల్యాప్‌ టాప్ మోడల్స్ ఏవి?  మీ ప్రొడక్టివిటీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే.. టాప్-5 ఛాయిస్ ఏంటో, లేటెస్ట్ ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌తో సహా ఇప్పుడు తెలుసుకుందాం.

5 మల్టీటాస్కింగ్ లెనోవో 16GB RAM ల్యాప్‌టాప్స్:

1. లెనోవో థింక్‌బుక్ 16 (Lenovo ThinkBook 16):

ఆఫీస్ వర్క్, బిజినెస్ పనులు చేసే వాళ్లకు ఈ థింక్‌బుక్ సిరీస్ ఎప్పుడూ నెంబర్ వన్ చాయిసే! ఇందులో.. ఉండే పవర్‌ఫుల్ ప్రాసెసర్, 16జీబీ ర్యామ్ చాలా బాగా ఉపయోగ పడతాయి. ఎక్సెల్ షీట్లు ఎన్ని ఓపెన్ చేసినా, పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌లు రన్ చేసినా.. ఏమాత్రం లాగ్ అవ్వకుండా.. రాకెట్‌లా స్మూత్‌గా పని చేస్తుంది. పైగా.. దీని యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే కళ్లకు ఎలాంటి స్ట్రెయిన్ పడకుండా కాపాడుతుంది.

2. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3(Lenovo IdeaPad Slim 3-16GB RAM):

Advertisement

ఆఫీస్ ఉద్యోగులు, స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ ఇది. ఇంటెల్ కోర్ లేదా రైజెన్ ప్రాసెసర్ ఆప్షన్స్‌తో.. వచ్చే ఈ ల్యాప్‌ టాప్‌లో.. 16 జీబీ డ్యూయల్-ఛానెల్ ర్యామ్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చాలా ఈజీ అయిపోతుంది. తక్కువ బడ్జెట్‌లో.. అదిరిపోయే పర్ఫార్మెన్స్ కోరుకునేవాళ్లకు.. ఇది పక్కా సూటవుతుంది.

3. లెనోవో ఎల్ఓక్యూ (Lenovo LOQ – 16GB RAM / 512GB SSD):

ఇది పేరుకు గేమింగ్ ల్యాప్‌టాప్ అయినా.. సరే, ఆఫీస్ హెవీ వర్క్స్‌కు బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలోని పవర్‌ ఫుల్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ కార్డ్ వల్ల హెవీ ఆఫీస్ సాఫ్ట్‌ వేర్స్, వీడియో ఎడిటింగ్ పనులన్నీ.. ఇట్టే అయిపోతాయి. 16 జీబీ ర్యామ్ తో పాటు.. ఫాస్ట్ SSD ఉండటం వల్ల ల్యాప్‌ టాప్ ఆన్ చేసిన సెకన్లలోనే రెడీ అవుతుంది.

Advertisement

Also Read: తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫ్రిజ్..రూ.15వేలలోపు బెస్ట్

4. లెనోవో యోగా ప్రో సిరీస్ (Lenovo Yoga Pro Series):

స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీల్, సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోరుకునే.. ప్రొఫెషనల్స్ కోసం ఈ యోగా సిరీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. హై-ఎండ్ ప్రాసెసర్లు, రోజంతా వచ్చే బ్యాటరీ బ్యాకప్ , 16 జీబీ హై-స్పీడ్ ర్యామ్ దీని సొంతం. ఆఫీస్ ప్రెజెంటేషన్స్, జూమ్ మీటింగ్స్ అన్నీ నాన్-స్టాప్‌గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని ద్వారా  పూర్తి చేయొచ్చు.

5. లెనోవో లెజియన్ 5ఐ /స్లిమ్ 5(Lenovo Legion 5i/Slim 5):

పనిలో అసలు కాంప్రమైజ్ కాకూడదు. అన్నీ టాప్-నాచ్ ఉండాలి అనుకునే.. హెవీ యూజర్స్ కోసం ఇది అల్టిమేట్ చాయిస్. హై-పెర్ఫార్మెన్స్ ఇంటెల్ లేదా రైజెన్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీ దీని ప్రత్యేకత. ఎంత పెద్ద హెవీ టాస్క్ అయినా దీంతో చిటికెలో పూర్తి చేయొచ్చు.

చిన్న గమనిక: అమెజాన్‌లో జరిగే సేల్స్, ఆఫర్లను బట్టి ఈ ల్యాప్‌ టాప్ ధరలు మారుతుంటాయి.కాబట్టి కొనేముందు.. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఒక సారి చెక్ చేసుకుంటే మంచి డీల్ మీ సొంతం అవుతుంది.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×