E-Paper
Advertisement

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టిన కోహ్లీ…RCB ప్లేయ‌ర్ వాడుకుని మ‌రీ

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టిన కోహ్లీ…RCB ప్లేయ‌ర్ వాడుకుని మ‌రీ
Advertisement

ENG VS PAK:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆగస్టు 19వ తేదీన లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. అయితే మొదటి టెస్ట్ లో అందరు ఊహించినట్లుగానే పాకిస్తాన్ జట్టుపై ఇంగ్లాండ్ స్పష్టంగా ఆధిపత్యం చెలాయిస్తోంది. బాబర్ ఆజం గాయపడటంతో పాకిస్తాన్ జట్టు మరింత ఒత్తిడిలోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 171 పరుగులు చేసి కుప్పకూలింది పాకిస్తాన్. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది. అయితే, ఈ మ్యాచ్ సంద‌ర్భంగా పాకిస్తాన్ ను విరాట్ కోహ్లీ దెబ్బ కొట్టాడ‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

ఇంగ్లాండ్ తో టెస్ట్.. పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టిన విరాట్ కోహ్లీ

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ పేరు మారుమోగుతోంది. పాకిస్తాన్ ఎక్కడికి వెళ్లినా వాళ్లను దెబ్బ కొట్టేందుకు విరాట్ కోహ్లీ తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కీలక ఇన్నింగ్స్ లు ఆడి విరాట్ కోహ్లీ అనేక సార్లు గెలిపించాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ ను దెబ్బ కొట్టాడు విరాట్ కోహ్లీ.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

అదేంటి ? ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఏం చేశాడని పొర‌పాటు ప‌డ‌కండోయ్. అతడు మ్యాచ్ ఆడకపోయినా కూడా పాకిస్తాన్ జట్టును దెబ్బతీశాడు. ఇదే అక్ష‌రాల నిజం. ఇంగ్లాండ్ కుర్రాడు జోర్డాన్ కాక్స్ ( Jordan Cox)కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి మ్యాచ్ కు పంపించాడు కోహ్లీ. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ సందర్భంగా 73 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఈ జోర్డాన్ కాక్స్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతడికి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. అతడి ఫేవరెట్ క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీనే.

జోర్డాన్ కాక్స్ కు ట్రైనింగ్ ఇచ్చి పంపిన కోహ్లీ

Advertisement

అయితే పాకిస్తాన్ తో తొలి టెస్ట్ ప్రారంభం కాకముందు విరాట్ కోహ్లీని క‌లిశాడు జోర్డాన్ కాక్స్. ఈ సందర్భంగా టెస్టుల్లో ఎలాంటి అడుగులు వేయాలి..? పాకిస్తాన్ పైన ఎలా రాణించాలి? అనే దాని పైన విరాట్ కోహ్లీ దగ్గర కీలక సూచనలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండులోనే విరాట్ కోహ్లీ ఉంటున్నాడు కాబట్టి.. వెంటనే వెళ్లి అతడి దగ్గర పాకిస్తాన్ సీక్రెట్స్ జోర్డాన్ కాక్స్ తెలుసుకున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక పాకిస్తాన్ పై దెబ్బకొట్టేందుకు విరాట్ కోహ్లీ కూడా జోర్డాన్ కాక్స్ కు హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది. ఉన్న‌వి, లేనివి అన్ని నూరి పోసి.. బ‌రిలోకి జోర్డాన్ కాక్స్ ని కోహ్లీ బ‌రిలోకి దింపిన‌ట్లు స‌మాచారం. అందుకే తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా జోర్డాన్ కాక్స్ ఆడిన‌ట్లు పోస్టులు పెడుతున్నారు.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

 

 

Related News

పాకిస్తాన్ ఓ బికారి దేశం…లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించిన ఇంగ్లాండ్

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

ఒరేయ్ రిజ్వాన్, నీకు బుర్ర ఉందా…ర‌నౌట్ చేయ‌కుండా, ఆ అప్పీల్ ఎంట్రా ?

కోహ్లీ, మెస్సి, రోనాల్డో కంటే, పాకిస్తాన్ గొప్ప ప్లేయ‌ర్లు ఉన్నారు

2007లోనే టీమిండియాను ఓడించి, ఇంటికి పంపించాం

ఆసియా క‌ప్ గెలిస్తే, అన్ని మూసుకుని న‌ఖ్వీ చేతుల మీదుగా తీసుకోవాల్సిందే

విరాట్ కోహ్లీనే రియ‌ల్ కింగ్…అత‌ను పాకిస్తాన్ లో పుట్టుంటే బాగుండేది

Big Stories

Advertisement
×