LG 185 L Direct Cool Single Door Refrigerator: ఇంట్లో కూరగాయలు, పాలు, పండ్లు తాజాగా ఉండాలంటే ఒక మంచి సింగిల్ డోర్ ఫ్రిజ్ చాలా అవసరం. మార్కెట్లో అనేక బ్రాండ్లు ఉన్నప్పటికీ, నమ్మకానికి మరో పేరుగా నిలిచే LG బ్రాండ్ నుంచి వచ్చిన 185 లీటర్ల ఫ్రిజ్ కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.ఇప్పుడు మార్కెట్లో ఇది కేవలం రూ. 14,990 ధరకే అందుబాటులోకి వస్తోంది.అద్భుతమైన కూలింగ్ టెక్నాలజీ, అదనపు స్టోరేజ్ కోసం బేస్, స్టైలిష్ లుక్‌తో వస్తున్న ఈ ఫ్రిజ్ చిన్న కుటుంబాలకు బెస్ట్. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ రిఫ్రిజిరేటర్ స్పెషల్ అట్రాక్షలన్ దీనిలో ఉన్న బేస్ డ్రయర్ . సాధారణంగా సింగిల్ డోర్ ఫ్రిజ్‌ల కింద స్టోరేజ్ ఉండదు, కానీ ఇందులో కింద భాగంలో ఒక ప్రత్యేకమైన డ్రయర్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను ఫ్రిజ్ కిందనే స్టోర్ చేసుకోవచ్చు, తద్వారా కిచెన్ నీట్‌గా కనిపిస్తుంది. అలాగే దీని మోడ్రన్ డిజైన్ ఇళ్లలోని కిచెన్ లుక్‌ను మరింత పెంచుతుంది.
ఈ ఫ్రిజ్ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పని చేస్తుంది. కాబట్టి ఇది తక్కువ సమయంలోనే ఆహార పదార్థాలను వేగంగా, సమర్థవంతంగా చల్లబరుస్తుంది. వేసవి కాలంలో కూడా చల్లటి నీరు, తాజా కూరగాయలు కావాలనుకునే వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. 2-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి కరెంట్ ఖర్చును కూడా అదుపులో ఉంటుంది.
1 నుంచి ముగ్గురు సభ్యులు ఉండే చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్స్‌కు ఈ 185 లీటర్ల కెపాసిటీ సరిగ్గా సరి పోతుంది. లోపల సర్దుబాటు చేయడానికి తగినన్ని షెల్ఫ్‌లు, బాటిల్స్ పెట్టుకోవడానికి డోర్ రాక్స్ ఉన్నాయి. పాలు, పెరుగు, రోజువారీ వంట సామగ్రి స్టోర్ చేసుకోవడానికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
మనలో చాలా మంది కరెంట్ వోల్టేజ్ సమస్యలు ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటాము. దీని వల్ల ఫ్రిజ్ మోటార్ పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ LG రిఫ్రిజిరేటర్ స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేషన్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఎలాంటిస్టెబిలైజర్ సహాయం లేకుండానే హెవీ వోల్టేజ్ సమస్యను (సాధారణంగా 90V నుండి 310V వరకు) తట్టుకుని పని చేస్తుంది. దీని వల్ల అదనంగా స్టెబిలైజర్ కొనాల్సిన ఖర్చు తప్పుతుంది. అంతే కాకుండా తరచూ కరెంట్ పోయినా ఫ్రిజ్ పాడవకుండా ఉంటుంది.
Also Read: రూ.1069కే 60H బ్యాటరీ..ఇయర్‌బడ్స్! గేమింగ్, మ్యూజిక్ కోసం బెస్ట్
ధర:
ప్రముఖ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ LG రిఫ్రిజిరేటర్ ధర సుమారు రూ.14,990 వరకు ఉంది. ఈ బడ్జెట్‌లో బేస్ డ్రయర్ ఆప్షణ్, నమ్మకమైన LG బ్రాండ్ వారంటీ లభించడం నిజంగా గొప్ప విషయమే. మన్నిక , నాణ్యత కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.
గమనిక: ప్రాంతాన్ని బట్టి లేదా ఆన్‌లైన్ సేల్స్, ఆఫర్ల ఆధారంగా ధరల్లో కాస్త మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనే ముందు స్థానిక షోరూమ్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో ధరను చెక్ చేసుకోవడం మంచిది.