E-Paper
Advertisement

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026.. అన్ని ప్రొడక్ట్స్‌పై ఊహించని ఆఫర్లు !

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026.. అన్ని ప్రొడక్ట్స్‌పై ఊహించని ఆఫర్లు !
Advertisement

Amazon Great Freedom Sale 2026: కొత్త గాడ్జెట్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెక్ లవర్స్ కోసం అమెజాన్ అద్భుతమైన ప్రకటన చేసింది. ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026’ (Amazon Great Freedom Sale 2026) తేదీలు, సూపర్ డీల్స్ అధికారికంగా రివీల్ అయ్యాయి. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, సౌండ్‌బార్‌లు, ట్యాబ్లెట్లు,ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో ఏయే వస్తువులపై ఎలాంటి బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రత్యేకతలు, తేదీలు:

ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమెజాన్ నిర్వహించే ఈ భారీ సేల్ కోసం కస్టమర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రముఖ బ్యాంక్ భాగస్వామ్యంతో.. అందిస్తున్న ఆఫర్లు కస్టమర్లకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ లావాదేవీలపై తక్షణ తగ్గింపు లభిస్తుండటంతో పాటు, ప్రత్యేక క్యాష్‌బ్యాక్ లాభాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉండటం వల్ల కస్టమర్లు తమకు నచ్చిన గాడ్జెట్లను చాలా తక్కువ బడ్జెట్‌లో సొంతం చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం.

లాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు:

Advertisement

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, ఆఫీస్ ఉద్యోగులకు, స్టూడెంట్స్‌కు , గేమర్స్‌కు ఈ సేల్ ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. హెచ్‌పి, డెల్, లెనోవో, ఆసుస్ వంటి టాప్ బ్రాండ్ల లాప్‌టాప్‌లపై భారీ కూపన్ డిస్కౌంట్లు ప్రకటించారు. లేటెస్ట్ ప్రాసెసర్‌లతో కూడిన గేమింగ్ లాప్‌టాప్‌లు , హై-ఎండ్ నోట్‌బుక్‌లు భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌తో తక్కువ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ డిజైనింగ్, కోడింగ్ ,హెవీ అప్లికేషన్స్ రన్ చేసే లాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్ సమయంలో దక్కే ధరలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

సౌండ్‌బార్‌లు, హోమ్ ఆడియో సిస్టమ్స్:

ఇంటి వద్దే సినిమా థియేటర్ లాంటి రియాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం బోట్, జేబీఎల్, సోనీ, శామ్‌సంగ్ వంటి ప్రముఖ బ్రాండ్ల సౌండ్‌బార్‌లు భారీ తగ్గింపు ధరలతో మార్కెట్లోకి వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ ,డీప్ బాస్ సపోర్ట్ ఉన్న శక్తివంతమైన సబ్ వూఫర్లు , హోమ్ థియేటర్ సిస్టమ్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్ ,సినిమా ప్రేమికులు తమ లివింగ్ రూమ్‌ను మినీ థియేటర్‌గా మార్చుకోవడానికి ఈ ఆడియో డీల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

Advertisement

Also Read: సగం ధరకే.. 50 ఇంచుల టీవీలు,ఆఫర్ పూర్తవకముందే కొనండి

ట్యాబ్లెట్లు , ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్లపై ఆఫర్లు:

ఆన్‌లైన్ క్లాసులు వినడానికి, కార్పొరేట్ మీటింగ్స్ అటెండ్ కావడానికి లేదా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగపడే శామ్‌సంగ్, లెనోవో ,ఐప్యాడ్ ట్యాబ్లెట్లపై కూడా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించారు. స్టైలస్ పెన్ సపోర్ట్, హై-రెజల్యూషన్ డిస్‌ప్లే కలిగిన ట్యాబ్లెట్లు పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌పై కూడా ఫ్లాట్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఎలాంటి అదనపు ఇబ్బందులు లేకుండా అత్యంత బెస్ట్ ప్రైస్‌లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ దక్కించుకోవడానికి ఈ సేల్ చక్కటి వేదికగా నిలుస్తుంది.

మొత్తానికి.. మీరు కొత్త లాప్‌టాప్, హోమ్ థియేటర్ సౌండ్‌బార్ లేదా ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్లు . డీల్స్ కొంత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి, సేల్ ప్రారంభం కాగానే మీకు నచ్చిన ప్రొడక్ట్స్‌ను ముందుగా మీ కార్ట్‌లో యాడ్ చేసుకుని తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

Related News

శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!

థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

Big Stories

Advertisement
×