E-Paper
Advertisement

యూజర్లు నిద్రపోతున్నా బ్యాగ్రౌండ్‌లో వర్క్ కంప్లీట్ చేసే Google Gemini Spark.. భారత్‌లో లాంచ్!

యూజర్లు నిద్రపోతున్నా బ్యాగ్రౌండ్‌లో వర్క్ కంప్లీట్ చేసే Google Gemini Spark.. భారత్‌లో లాంచ్!
Advertisement

Google Gemini Spark: కృత్రిమ మేధ (AI) రంగంలో గూగుల్ మరో భారీ అడుగు వేసింది. ఇప్పటివరకు మన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే చాట్‌బాట్‌లను చూశాం, కానీ మన తరఫున పనులు పూర్తి చేసే AI ఏజెంట్‌ను గూగుల్ భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అదే Gemini Spark. గతంలో గూగుల్ ఐ/ఓ ఈవెంట్‌లో ప్రకటించిన ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్, ఇప్పుడు మన దేశంలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.

డిజిటల్ పనులకు ఇక గుడ్ బై..

Gemini Spark కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఒక నిజమైన డిజిటల్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. రోజూ మనం చేసే మెయిల్స్ పంపడం, పెద్ద పెద్ద డాక్యుమెంట్లను సారాంశంగా మార్చడం, ముఖ్యమైన నోట్స్ ఆర్గనైజ్ చేయడం వంటి పనులను ఇది సులువుగా పూర్తి చేస్తుంది. దీనివల్ల ఆఫీస్ పనులు, వ్యక్తిగత డిజిటల్ పనుల భారం చాలావరకు తగ్గుతుంది.

Advertisement

Also Read: జియో కస్టమర్లకు లక్కీ ఛాన్స్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2.5GB డేటా.. ఉచితంగా Gemini Pro!

మనం నిద్రపోతున్నా ఇది ఆగదు..

ఈ ఫీచర్‌లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. మనం ఫోన్ లేదా లాప్‌టాప్‌ను పక్కన పెట్టేసినా ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తూనే ఉంటుంది. మనం ఇచ్చిన సూచనల ఆధారంగా మీటింగ్‌లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, చివరికి నిద్రపోతున్నా సరే అనుకున్న పనులను బాధ్యతాయుతంగా పూర్తి చేస్తుంది. లేటెస్ట్ జెమిని 3.5 మోడల్‌పై పనిచేయడం వల్ల దీనికి గ్రహణ శక్తి, ఆలోచనా సామర్థ్యం చాలా ఎక్కువ.

వర్క్‌స్పేస్‌తో సులువైన అనుసంధానం..

Advertisement

జీ-మెయిల్, గూగుల్ డాక్స్, షీట్స్ వంటి వర్క్‌స్పేస్ యాప్‌లతో ఇది నేరుగా కలిసిపోతుంది. ఎలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. రోజూ వందల కొద్దీ ఈ-మెయిల్స్ వచ్చే ఉద్యోగులకు డ్రాఫ్ట్‌లు సిద్ధం చేయడం, విద్యార్థులకు చదువుకునే మెటీరియల్స్ షార్ట్ చేయడం వంటి విషయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

డేటా భద్రత మన చేతుల్లోనే..

ఈ ఏజెంట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ.. మన ప్రైవసీకి గూగుల్ పెద్దపీట వేసింది. మన అనుమతి లేకుండా ఏ యాప్‌నూ ఇది యాక్సెస్ చేయలేదు. ఏ యాప్‌కి పర్మిషన్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది పూర్తిగా మన నియంత్రణలోనే ఉంటుంది. అవసరం లేదనుకున్నప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ అసిస్టెంట్‌ను ఒకే క్లిక్‌తో ఆఫ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు గూగుల్ AI ప్రో, అల్ట్రా పేయిడ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వస్తున్నాయి.

Also Read: రూ.16 వేలకే రఫ్ అండ్ టఫ్ ఫోన్.. సన్‌రైజ్ గోల్డ్ కలర్‌లో ఆకట్టుకుంటున్న Honor X6e 4G!

Related News

శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!

థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

Big Stories

Advertisement
×