Amazon vs flipkart sale: పండగ సీజన్ వస్తోందంటే చాలు, ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కు నిద్రపట్టదు! ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లు, ఇయర్ బడ్స్ వంటి గాడ్జెట్స్ తక్కువ ధరలకు కొనడానికి దేశం మొత్తం ఎదురు చూసే అతిపెద్ద పండగలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ , ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్. ఈ రెండింటిలో ఏ ఈ-కామర్స్ దిగ్గజం టెక్ లవర్స్‌కు నిజమైన లాభాలను తెచ్చిపెడుతుంది? ఏ సేల్ ఈవెంట్ గాడ్జెట్స్ కొనడానికి బెస్ట్ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్ కొనుగోలు విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ తన ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌లో ఐఫోన్‌లు, కొన్ని పాపులర్ ఆండ్రాయిడ్ బ్రాండ్లపై.. ఊహించని రేంజ్‌లో ప్రైస్ కట్స్ ఇస్తుంది. లాంచ్ అయిన తక్కువ కాలంలోనే.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లభిస్తాయి. మరో వైపు, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌లో శామ్ సంగ్, వన్ ప్లస్, ఐక్యూ వంటి స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించి ఎక్స్క్లూజివ్ లాంచ్‌లు , నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు మెండుగా ఉంటాయి.
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం.. ల్యాప్ టాప్‌లు, ట్యాబ్ లేదా స్మార్ట్ టీవీలు కొనాలనుకుంటే.. మాత్రం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కొంచెం ముందుంటుంది. హెచ్‌పీ, డెల్, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్లపై.. అమెజాన్ అందించే బ్యాంక్ డిస్కౌంట్లు , కూపన్ ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా.. ఉంటాయి. అంతేకాకుండా.. హోం అప్లయన్సెస్, స్మార్ట్ హోమ్ గాడ్జెట్ల విషయంలో అమెజాన్ వేరియేషన్స్ ఎక్కువగా చూపిస్తుంది.
ఈ రెండు సేల్స్‌లోనూ అసలు మ్యాజిక్ జరిగేది క్రెడిట్, డెబిట్ కార్డ్ డిస్కౌంట్ల మీదే. ఫ్లిప్ కార్ట్ కొన్ని ప్రత్యేక బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు ఇన్‌స్టాంట్ సేవింగ్స్ అందిస్తే, అమెజాన్ తన పార్టనర్ బ్యాంక్ కార్డ్స్‌తో పాటు ప్రైమ్ మెంబర్లకు ముందుగానే సేల్ యాక్సెస్ కల్పిస్తుంది. ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వారికి.. డెలివరీ పరంగా అమెజాన్ వేగంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్ కూడా తన ‘ప్లస్’ కస్టమర్ల కోసం ప్రత్యేక డీల్స్‌ను రూపొందిస్తుంది.
Also Read: ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందే అద్భుతమైన లాభాలు!
ప్రస్తుత ట్రెండ్ , యూజర్ల ఇంట్రస్ట్ ప్రకారం చూస్తే, కేవలం ఒకే ప్లాట్‌ఫారమ్‌కు.. పరిమితం కాకుండా ఏ సేల్‌లో తక్కువ ధరకు ప్రొడక్ట్ లభిస్తుందో పోల్చుకోవడం చాలా ముఖ్యం. ఐఫోన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్లు కావాలంటే బిగ్ బిలియన్ డేస్ బెటర్. అలా కాకుండా రకరకాల ఎలక్ట్రానిక్స్, ఫాస్ట్ డెలివరీ , ట్రస్టెడ్ కస్టమర్ సర్వీస్ కావాలంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వైపు మొగ్గు చూపడం మంచిది.
మొత్తానికి చూస్తే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ రెండు కూడా గాడ్జెట్ లవర్స్‌కు పండగ వాతావరణాన్ని తెస్తాయి. మీరు కొనాలనుకుంటున్న.. నిర్దిష్టమైన గాడ్జెట్ ఏ ప్లాట్‌ఫారమ్‌లో తక్కువ ధరకు వస్తోందో ముందే విశ్లేషించుకుని, సేల్ ప్రారంభమైన మొదటి రోజే.. ఆర్డర్ చేయడం ద్వారా భారీగా డబ్బు సేవ్ చేసుకోవచ్చు!