Amazon great indian festival 2026: సంవత్సరం మొత్తం మీద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పండగ సీజన్ వచ్చేసింది. అమెజాన్ తన మోస్ట్ అవేటెడ్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ డేట్లను అధికారికంగా ప్రకటించడంతో ఆన్‌లైన్ షాపింగ్ హడావిడి మొదలైంది. కొత్త స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లు, హోమ్ అప్లయన్సెస్ వంటి ఏది కొనాలన్నా ఇదే సరైన సమయం. అయితే.. ఈ సేల్‌లో మామూలు కస్టమర్ల కంటే ‘అమెజాన్ ప్రైమ్’ మెంబర్స్‌కు డబుల్ ధమాకా లాభాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణ ప్రజలకు సేల్ ఎప్పుడు మొదలవుతుందో అందరికీ తెలుసు. కానీ ప్రైమ్ మెంబర్లకు మాత్రం అన్ని డీల్స్ , బ్లాక్ బస్టర్ ఆఫర్లు కొన్ని గంటల ముందే అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల స్టాక్ అయిపోతుందనే టెన్షన్ లేకుండా, మీకు నచ్చిన లిమిటెడ్ స్టాక్ గాడ్జెట్స్ లేదా ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
ఆఫర్లతో పాటు, ప్రైమ్ మెంబర్స్‌కు.. ప్రత్యేకంగా అదనంగా మరో 10 శాతం వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అంటే సాధారణ కస్టమర్లతో పోలిస్తే.. ప్రైమ్ మెంబర్లు ప్రతి కొనుగోలుపై మరింత ఎక్కువగా డబ్బును ఆదా చేసుకోవడానికి ఈ ఫీచర్ అద్భుతంగా సహాయ పడుతుంది.
పండగ రద్దీ సమయంలో.. సాధారణ ఆర్డర్లు డెలివరీ కావడానికి రోజులు పట్టొచ్చు. కానీ ప్రైమ్ మెంబర్స్‌కు ఉండే.. మేజర్ ప్లస్ పాయింట్ అన్ లిమిటెడ్ ఫ్రీ సేమ్-డే లేదా నెక్స్ట్-డే డెలివరీ. అంతేకాకుండా.. విస్తరిస్తున్న అమెజాన్ క్విక్-కామర్స్ సర్వీసెస్ ద్వారా నిత్యవసర వస్తువులు క్షణాల్లో మీ ఇంటికి చేరుతాయి.
అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఏఐ ఫీచర్లను పరిచయం చేసింది. ప్రైమ్ మెంబర్లు.. ఈ టూల్స్ సహాయంతో.. ప్రొడక్ట్స్‌ను ఈజీగా కంపేర్ చేయవచ్చు, ప్రైస్ హిస్టరీని చెక్ చేయెచ్చు . తమ అవసరానికి తగిన బెస్ట్ రికమండేషన్లను పొందవచ్చు. దీని వల్ల టైమ్ వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్ షాపింగ్ చేయొచ్చు.
Also Read: కరెంట్ పోతే ఏంటీ ? సినిమా మాత్రం ఆగదు బాస్!
కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా.. పండగ రోజుల్లో ఫ్యామిలీతో.. కలిసి ఎంజాయ్ చేయడానికి ప్రైమ్ వీడియోలో ప్రత్యేకమైన ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్స్, లేటెస్ట్ సినిమాలు , బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌ల లైనప్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా షాపింగ్ చేస్తూనే మరో వైపు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించవచ్చు.
మొత్తానికి చూస్తే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుంచి ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి ‘ప్రైమ్ మెంబర్షిప్’ అనేది ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ లాంటిది. ఎర్లీ యాక్సెస్, ఎక్స్‌ట్రా సేవింగ్స్, ఫాస్ట్ డెలివరీ వంటి అవకాశాలతొ మీ పండగ షాపింగ్‌ను మరింత ఈజీగా, ఆనందంగా మార్చుకోండి!
Also Read: బట్టలను క్షణాల్లో క్లీన్ చేసే అద్భుతమైన టెక్నాలజీ..బెస్ట్ 8కేజీ వాషింగ్ మెషీన్స్ లిస్ట్