E-Paper
Advertisement

రూ. 299 ప్లాన్ మళ్లీ తెచ్చిన ఎయిర్‌టెల్.. అయినా యూజర్లకు నిరాశే.. కారణం ఏంటో తెలుసా?

రూ. 299 ప్లాన్ మళ్లీ తెచ్చిన ఎయిర్‌టెల్.. అయినా యూజర్లకు నిరాశే.. కారణం ఏంటో తెలుసా?
Advertisement

Airtel Reintroduces Plan: వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల క్రితం నిలిపివేసిన అత్యంత ప్రజాదరణ పొందిన రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇందులో ఇచ్చే డేటా ప్రయోజనాలను భారీగా తగ్గించి వినియోగదారులకు కొంత నిరాశ కలిగించింది.

కొత్త రూ. 299 ప్లాన్ వివరాలు ఇవే..

రీఎంట్రీ చేసిన రూ. 299 ప్లాన్ వ్యాలిడిటీని 28 రోజులుగా ఎయిర్ టెల్ నిర్ణయించింది. ఇందులో ప్రతిరోజూ 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు యూజర్లకు లభించనున్నాయి. అయితే గతంలో ఇదే ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు రోజువారీ డేటాను 1 జీబీకి తగ్గించడం.. యూజర్లలో అసంతృప్తికి కారణమవుతోంది.

యూజర్ల కోత.. పెరిగిన నిష్క్రమణలు

Advertisement

ఆగస్టు నెలలో ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్‌తో సహా మొత్తం ఐదు చౌకైన ప్లాన్లను నిలిపివేసింది. ఫలితంగా రోజువారీ డేటా కావాలనుకునే వారు తప్పనిసరిగా రూ. 349 ప్లాన్ (రోజుకు 2 జీబీ డేటా) ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది పరోక్షంగా 16 శాతం ధర పెంపునకు దారితీసింది. దీంతో జూన్ త్రైమాసికంలో 3.27 మిలియన్లుగా ఉన్న ఎయిర్‌టెల్ కొత్త చందాదారుల సంఖ్య.. సెప్టెంబర్ త్రైమాసికానికి దారుణంగా పడిపోయి కేవలం 0.72 మిలియన్లకు పరిమితమైంది. అంతేకాకుండా వినియోగదారులు నెట్‌వర్క్ మారే రేటు 2.6 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగింది.

Also Read: మోదీ పాలనపై సోనియా ఫైర్.. 1975 నాటి ఎమర్జెన్సీపై క్లారిటీ.. కేంద్రమంత్రులు స్ట్రాంగ్ కౌంటర్!

వ్యూహాత్మకంగా ఎయిర్‌టెల్ అడుగులు

Advertisement

ప్రత్యర్థి సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు రూ. 299 ధరలోనే ప్రీపెయిడ్ ప్లాన్లను కొనసాగిస్తుండటంతో ఎయిర్‌టెల్ కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌ల వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కస్టమర్ల నిష్క్రమణను అడ్డుకునేందుకు ఎయిర్‌టెల్ మళ్లీ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మరోవైపు ఎయిర్ టెల్ చందాదారుల సంఖ్య తగ్గినా.. సగటు వినియోగదారుని ద్వారా వచ్చే రాబడి (ARPU) ఏమాత్రం తగ్గలేదు. జూన్ త్రైమాసికంలో ARPU రూ. 264 ఉండగా.. సెప్టెంబర్ నాటికి రూ. 271కి పెరిగింది.

Also Read: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి హవా.. పులివెందులలో టీడీపీ విక్టరీ.. ఇంకా ఎక్కడెక్కడ గెలిచారంటే?

Tags

Related News

అద్భుతమైన ఫీచర్లతో..తోషిబా 4K టీవీ మోడల్స్ లాంచ్!

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక సీక్రెట్‌గా మెసేజ్‌లు చదవొచ్చు, బ్లూ టిక్స్ పడవు!

తక్కువ ధరలో బెస్ట్ డిష్ వాషర్ కావాలా ? వీటికంటే బెస్ట్ ఉండవు!

బోస్ సౌండ్ ట్విస్ట్‌తో మోటో కొత్త ఇయర్ బడ్స్.. మిగతా బ్రాండ్స్‌కు నిద్రలేకుండా చేసేలా ఫీచర్లు!

హార్డ్ వాటర్‌లోనూ బట్టలు మెరిపించే.. టాప్ 5 IFB ఫ్రంట్ లోడ్ మోడల్స్!

మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!

రూ.200 లోపే అన్‌లిమిటెడ్ కాలింగ్.. Jio, Airtel, Vi వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఏది బెటర్ అంటే?

Big Stories

Advertisement
×