Jurala Water: స్వేచ్ఛ బ్యూరో: గత వారం రోజులుగా జూరాల ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాలు, రాస్తారోకోలు, డ్యాం ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు నీరు విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో 7 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదం పొందింది. నెల రోజులపాటు రోజుకి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనుంది.ఈ నేపథ్యంలో జూరాల నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నేటి ఉదయం జూరాల దగ్గర అధికారులు కుడి, ఎడమ కాలువలకునీటిని విడుదల చేయించారు.
నీటిని పొదుపుగా వాడుకోండి
ప్రస్తుత ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంట పొలాలకు సాగునీరు విడుదలకు ఇబ్బందులు తలెత్తాయి. కర్ణాటక ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం నీటి విడుదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ఇప్పటికే వరి పంటలు సాగు చేసి పొట్ట దశలో ఉన్న దృష్ట్యా రైతుల కష్టాన్ని గుర్తించి, పెట్టిన పెట్టుబడులు నష్టపోకుండా పంట పూర్తయ్యేందుకు సాగునీటిని విడుదల చేసింది.
Also Read: మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!