Samsung Galaxy S24 Ultra Amazon| అమెజాన్ ఇండియా.. ప్రైమ్ డే సేల్ 2025ను జులై 12, రాత్రి 12:00 గంటల నుండి జులై 14, రాత్రి 11:59 గంటల వరకు, మొత్తం 72 గంటల పాటు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం సేల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13s వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు ధర తగ్గింపు ఉంటుంది. అదనంగా.. ICICI లేదా SBI క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో 10% అదనపు డిస్కౌంట్, నో-కాస్ట్ EMI స్కీమ్‌లు, ఎక్స్చేంజ్ డీల్స్.. ఇతర ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై భారీ డిస్కౌంట్
ఈ ప్రైమ్ డే సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్ సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై ఉంది. ఈ ఫోన్ లాంచ్ ధర ₹1,24,999 కాగా, సేల్ సమయంలో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ₹74,999 నుండి ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఇతర డిస్కౌంట్‌లతో ఈ ఫోన్ ధర ₹80,000 కంటే తక్కువకు లభిస్తుంది. ప్రస్తుతం, అమెజాన్‌లో ఈ వేరియంట్ ₹84,999కు అందుబాటులో ఉంది, అయితే ఈ ఆఫర్ లో సుమారు ₹10,000 వరకు అదనంగా తగ్గింపు లభిస్తోంది.
గెలాక్సీ S24 అల్ట్రా ప్రధాన ఫీచర్లు
పవర్‌ఫుల్ ప్రాసెసర్
స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ అసాధారణ వేగం, పర్‌ఫామెన్స్‌ను అందిస్తుంది.
అద్భుతమైన డిస్‌ప్లే
6.8-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో స్పష్టమైన విజువల్స్, స్మూత్ ఇంటరాక్షన్‌లను అందిస్తుంది.
పవర్‌ఫుల్ కెమెరా సెటప్
200 MP ప్రధాన సెన్సార్
12 MP అల్ట్రా-వైడ్ లెన్స్
50 MP టెలిఫోటో లెన్స్
10 MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్
12 MP ఫ్రంట్ కెమెరా
ఈ కెమెరాలు తక్కువ లైట్ లో కూడా మంచి ఫొటోలు, జూమ్ నాణ్యత, రిచ్ ఇమేజ్ ప్రాసెసింగ్‌లో అద్భుతంగా పనిచేస్తాయి.
బ్యాటరీ చార్జింగ్
5,000 mAh బ్యాటరీతో, 45W వైర్డ్ చార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
అదనపు ప్రయోజనాలు
ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్
స్క్రీన్ బ్రైట్‌నెస్ ఉన్నా తక్కువ గ్లేర్
ఇన్ బిల్ట్ AI ఫీచర్లు
అత్యుత్తమ పనితీరు
ప్రీమియం కెమెరా నాణ్యత
సామ్‌సంగ్ నుండి దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్
సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మార్కెట్‌లో అత్యంత పవర్‌ఫుల్, ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. అమెజాన్ ప్రైమ్ డే 2025 సమయంలో.. ఈ ఫోన్ బ్యాంక్, EMI, ఎక్స్చేంజ్ ఆఫర్లతో ₹80,000 కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ప్రీమియం స్పెసిఫికేషన్‌లతో కూడిన హై-ఎండ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సేల్ కొనడానికి అత్యుత్తమ సమయం.