BigTV English

Kohli Home London: లండన్‌లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే… అంత రిచ్ ఏరియానా ?

Kohli Home London: లండన్‌లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే… అంత రిచ్ ఏరియానా ?

Kohli Home London: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఏ చిన్న విషయం బయటకి వచ్చినా సోషల్ మీడియా ఇట్టే షేక్ అయిపోతుంటుంది. 2025 ఐపీఎల్ సీజన్ తరువాత విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించడం అతడి అభిమానులు ఇప్పటికీ జర్నించుకోలేకపోతున్నారు. భారత టెస్ట్ క్రికెట్ కి విరాట్ కోహ్లీ ఒకరకంగా ప్రాణం పోసాడనే చెప్పాలి.


Also Read: Virat – Anushka: కోహ్లీ, అనుష్క పై దారుణంగా ట్రోలింగ్.. ఇండియా మ్యాచ్ కు వెళ్లకుండా అక్కడికి జంప్!

ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ లేకపోవడం భారత జట్టుకు ఓ మైనస్ అనే చెప్పాలి. ఇక టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం విరాట్ కోహ్లీ లండన్ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మొదటి టెస్ట్ మ్యాచ్ కి ముందు భారత జట్టు నూతన కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్ తో పాటు పలువురు క్రికెటర్లను విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ లోని తన ఇంటికి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడ వీరు కొన్ని గంటలపాటు విరాట్ కోహ్లీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది.


టెస్ట్ కెప్టెన్ గా గిల్ కి ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం. ఈ ఇంగ్లాండ్ సిరీస్ తోనే టీమ్ ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ {డబ్ల్యూటీసి} కొత్త సైకిల్ ని ప్రారంభించింది. గత డబ్ల్యుటిసి సీజన్ లో భారత జట్టు ఫైనల్ కీ చేరుకుంటుందని అందరూ భావించినప్పటికీ.. చివరికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ భారత్ జట్టుకు కీలకంగా మారింది. ఈ కొత్త డబ్ల్యూటీసి సీజన్ ను భారత జట్టు విజయంతో మొదలుపెట్టాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ వంటి ఆటగాడు.. యువ ఆటగాళ్లతో సమయం గడపడం, వారి మధ్య చర్చలు జరగడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో లండన్ లో విరాట్ కోహ్లీ చిరునామా ఎక్కడా..? అనే విషయంపై అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై తాజాగా ఓ మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీసాయి.

భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ అనంతరం కామెంట్రీ చేస్తున్న మాజీ ఇంగ్లాండ్ బ్యాటర్ జొనాథన్ ట్రోట్.. విరాట్ కోహ్లీ లండన్ అడ్రస్ గురించి ఒక కీలక సూచన చేశాడు. కోహ్లీ లండన్ లోని సెయింట్ జాన్స్ వుడ్ లేదా దానికి సమీపంలో నివసిస్తున్నాడని అనుకోకుండా వెల్లడించాడు. అయితే గతంలో కొన్ని మీడియా నివేదికలు మాత్రం కోహ్లీ లండన్ లోని “నాటింగ్ హిల్” లో నివసిస్తున్నాడని సూచించాయి.

Also Read: HBD Dhoni: ధోని క్రేజ్.. తెలుగు రాష్ట్రాల్లో 12 కటౌట్స్.. ఒక్కొక్కటి 50 అడుగులకు పైగానే

ఈ క్రమంలో ట్రోట్ చేసిన వ్యాఖ్యలు సెయింట్ జాన్స్ వుడ్ గురించి ప్రస్తావించడంతో.. కోహ్లీ అసలు నివాసం పై కొత్త ఊహగానాలు మొదలయ్యాయి. నాటింగ్ హిల్ నుండి సెయింట్ జాన్స్ వుడ్ సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందువల్ల ట్రోట్ చేసిన సూచన నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే లండన్ లో విరాట్ కోహ్లీ చిరునామా పై ఇప్పటివరకు స్పష్టత లేనప్పటికీ.. అతడు సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో స్థిరపడ్డాడని ప్రస్తుతానికి ఓ బలమైన సూచన అయితే ఉంది.

Related News

Pakisthan Blast : క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Asia Cup 2025 jersey : టీమిండియా న్యూ జెర్సీ వచ్చేసింది… జెర్సీ లేకుండానే.. ఫోటోలు చూసేయండి

Asia Cup 2025 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై బీసీసీఐ సంచలన ప్రకటన.. నెత్తురు మరుగుతోందని అభిమానుల ఆగ్రహం

Asia Cup 2025 : ఆసియా క‌ప్ 2025 జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

Neymar Junior : రూ.10వేల కోట్ల ఆస్తి.. ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చేసిన బిలియనీర్‌

Ross Taylor : రాస్ టేలర్ తో రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్లు వీళ్లే… లిస్టు పెద్దదే

Big Stories

×