E-Paper
Advertisement

పెళ్లికాని ప్రసాదులకు ఏఐ హెచ్చరిక.. ఫోటో చూసి ఫ్లాట్ అయ్యారో.. ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం!

పెళ్లికాని ప్రసాదులకు ఏఐ హెచ్చరిక.. ఫోటో చూసి ఫ్లాట్ అయ్యారో.. ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం!
Advertisement

AI Matrimony Scams: అసలే పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి రకరకాల రీజన్స్ ఉండి ఉండొచ్చు. సరిగ్గా ఇదే టైమ్‌లో చాలా మంది మ్యాటిమోనియల్ సైట్స్‌పై డిపెండ్ అవుతున్నారు. అందులో అబ్బాయి లేదా అమ్మాయిల ఫోటోస్ చూస్తే మతిపోయేలా ఉంటాయి.. మంచి ఉద్యోగం. విదేశాల్లో సెటిల్ అయినవారు… ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా అదిరిపోయింది. కొన్ని రోజులు చాటింగ్ జరిగింది. ఆ తర్వాత ఫోన్ కాల్స్ ఇలా అన్నీ బాగానే ఉన్న టైమ్‌లో సడెన్‌గా డబ్బు అవసరమవుతుంది. అప్పటికే నమ్మకం కుదరడంతో మీరు ఇచ్చేస్తారు. అప్పుడు మీకు తెలుస్తుంది. ఫోటో నకిలీ. గొంతు నకిలీ. ఉద్యోగం నకిలీ. ప్రేమ నకిలీ. చివరకు పెళ్లి సంబంధం కూడా నకిలీ అని. ఆ తర్వాత తెలుస్తుంది.. అసలు ఇదంతా ఏఐ మాయ అని. రీసెంట్‌గా జరుగుతున్న ఈ ఏఐ మోసాల గురించి తెలుసుకుందాం.

ఏఐ మోసాల గురించి తెలుసుకుందాం..

Advertisement

మనిషి గంటలో చేసే పనిని నిమిషాల్లో చేయగల అద్భుతమైన టెక్నాలజీ. మెడిసిన్‌ నుంచి ఎడ్యూకేషన్ వరకు, అగ్రికల్చర్‌ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు ఎన్నో రంగాల్లో చాలా మార్పులు తీసుకొస్తోంది అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ప్రతి టెక్నాలజీకి రెండు యాంగిల్స్ ఉంటాయి. కత్తి కూరగాయలు కోయడానికీ ఉపయోగపడుతుంది. అదే కత్తి ప్రాణాలు తీయడానికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏఐ కూడా అంతే. ఈ టెక్నాలజీని కొందరు సైబర్ నేరగాళ్లు అమాయకుల జీవితాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

మీరు చూస్తున్న ప్రొఫైల్ నిజమైనదేనా?

Advertisement

వెయ్యి అబద్ధాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలనే సామెత మీరు వినే ఉంటారు. ఆ అబద్ధాలు ఉద్యోగం, నకిలీ జీతం, ఫేక్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఏఐ హెల్ప్‌తో అచ్చం నిజమైన మనిషిలా కనిపించే ఫోటోలు సృష్టిస్తున్నారు. పోలీస్ ఆఫిసర్, డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి.. ఇలా సోసైటీలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తుల్లా నకిలీ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నారు.

గుజరాత్‌కు చెందిన హిమాన్షు పందాల్ ఇష్యూ..

గుజరాత్‌కు చెందిన హిమాన్షు పందాల్ ఇష్యూ దీనికి లెటెస్ట్ ఎగ్జాంపుల్. తాను గుజరాత్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ అయినట్లు ఏఐ హెల్ప్‌తో ఫోటోలు సృష్టించాడు. వాటిని ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి 20 మందికి పైగా యువతులను మోసం చేశాడు. అంటే.. మనం చూస్తున్న ఫోటో నిజమైన వ్యక్తిదేనా? లేక కంప్యూటర్ సృష్టించిందా? అనేది గుర్తించడం కూడా కష్టంగా మారింది.

ఏఐ వాయిస్ క్లోనింగ్, ఫేక్ ప్రొఫైల్స్

ఇక్కడితో ఆగిపోలేదు. ఫోటో చూసి అనుమానం వచ్చి ఫోన్‌లో మాట్లాడితే నిజమే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో ఒకరి గొంతును మరొకరి గొంతులా మార్చేయవచ్చు. ముంబైకి చెందిన ఓ వ్యక్తి మహిళ గొంతుతో మాట్లాడేందుకు వాయిస్ చేంజింగ్ టెక్నాలజీని ఉపయోగించి డాక్టర్లతో సహా పలువురిని మోసం చేశారు. అంటే ఫోటో చూసినా నమ్మలేం. గొంతు విన్నా నమ్మలేం.

మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఎలా తెలుసుకోవాలి?

మరి మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఎలా తెలుసుకోవాలి? ఇదే ఇప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో ఎదురవుతున్న అతిపెద్ద ఛాలెంజింగ్. ఇక కొన్ని ఏరియాల్లో ఈ మోసాలు వ్యక్తిగత స్థాయిని దాటి ఒక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌గా మారాయి. కాన్పూర్ వంటి ప్రాంతాల్లో నకిలీ మ్యారేజ్ బ్యూరోలు ఏర్పాటయ్యాయి. వీళ్లు ఏఐతో అందమైన అమ్మాయిల ఫోటోలు సృష్టిస్తారు. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తారు. పెళ్లి సంబంధాల కోసం ఎదురుచూస్తున్న యువకులను అట్రాక్ట్ చేస్తారు. ఆ తర్వాత అసలు వ్యాపారం మొదలవుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు.. తర్వాత వెరిఫికేషన్ ఫీజు.. ఆపై మీకు నచ్చిన ప్రొఫైల్‌ను చూపించడానికి ప్రత్యేక ఫీజు.. ఇలా ఒక్కో ట్రాప్‌లో పడేస్తూ డబ్బులు వసూలు చేస్తారు. ఇంకా కావాలంటే తమ ఉద్యోగులతోనే వరుడు, వధువుల తల్లిదండ్రుల్లా ఫోన్‌లో మాట్లాడిస్తారు. మీకు మరింత మంచి సంబంధాలు ఉన్నాయని ఆశ చూపిస్తారు. అంటే పెళ్లి సంబంధం కోసం వెళ్లిన మీరు.. తెలియకుండానే ఒక సైబర్ నేర ముఠా వలలో చిక్కుకున్నారన్నమాట.

ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్

ఇక బాధితుడు పూర్తిగా తమను నమ్మాడని అనిపించగానే అసలు ఆట మొదలవుతుంది. వ్యాపారంలో నష్టం వచ్చిందనో, కుటుంబంలో అత్యవసర పరిస్థితి వచ్చిందనో, ఏదైనా చట్టపరమైన సమస్య వచ్చిందనో చెబుతారు. మొదట చిన్న అమౌంట్ అడుగుతారు. అది పంపించగానే మరింత అమౌంట్ డిమాండ్ చేస్తారు. డబ్బు ఇవ్వడం ఆలస్యమైతే.. నన్ను నమ్మడం లేదా? మన పెళ్లి గురించి ఆలోచించడం లేదా? అంటూ ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలా ప్రేమను పెట్టుబడిగా పెట్టి.. నమ్మకాన్ని డబ్బుగా మార్చుకుంటారు. డబ్బు అందగానే ఫోన్ నంబర్ బ్లాక్.. ప్రొఫైల్ మాయం.

మొదట్లో చెప్పుకున్న ఎయిర్‌పోర్టు కథలోకి వెళ్దాం..

ఇప్పుడు మొదట్లో చెప్పుకున్న ఎయిర్‌పోర్టు కథలోకి వెళ్దాం. విదేశాల్లో ఉంటున్నానని ఒక మహిళను నమ్మించిన వ్యక్తి.. కొంతకాలం ఆన్‌లైన్‌లో చాటింగ్ చేశాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తాను ఇండియాకు వస్తున్నానని చెప్పాడు. ఫ్లైట్ ఎక్కినట్లు, ఇండియాకు చేరుకున్నట్లు మెసేజ్ చేశాడు. ఇంతలో ఆ మహిళకు ఒక అనౌన్‌ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. తాను ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఆఫీసర్‌ను అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చి.. మీకు కాబోయే భర్త దగ్గర అనుమతించిన దానికంటే ఎక్కువ విదేశీ కరెన్సీ ఉంది. అందుకే ఆయనను అదుపులోకి తీసుకున్నామని చెబుతారు. ఎట్ ది సేమ్ టైమ్ జీఎస్టీ, ఇన్‌కమ్ ట్యాక్స్, IMF వెరిఫికేషన్, వీసా ఇలా రకరకాల పేర్లతో కాల్ చేసి.. డబ్బులు డిమాండ్ చేశారు. మీరు చెల్లించిన డబ్బంతా తిరిగి వచ్చేస్తుంది అని నమ్మించారు. ఆమె కూడా తనకు కాబోయే భర్తకు సమస్య వచ్చిందనే ఆందోళనతో అడిగినంతా పంపించింది. కానీ చివరకు డబ్బూ తిరిగి రాలేదు. పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తీ కనిపించలేదు.

మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

మరి ఇలాంటి మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మొదటిది.. ఫోటో చూసి ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మేయకండి. రెండోది.. ఫోన్‌లో మాట్లాడారంటే నిజమైన వ్యక్తే అనుకోకండి. వీడియో కాల్‌లో కనిపించినా ఒకటికి రెండు సార్లు కన్ఫామ్ చేసుకోండి. మూడోది.. ఉద్యోగం, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, నివాసం వంటి వివరాలను రియల్‌గా కన్‌ఫామ్ చేసుకోండి. వీలైతే కుటుంబ సభ్యులు, తెలిసిన వ్యక్తుల ద్వారా కూడా కన్‌ఫామ్ చేసుకోండి. నాలుగోది.. పెళ్లి సంబంధం పేరుతో డబ్బులు అడిగితే మీరు డౌట్ పడాల్సిందే. ఐదోది.. మోసపోయినట్లు గుర్తిస్తే సిగ్గుపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి.

ఫోటో నకిలీ, గొంతు నకిలీ, చివరకు ప్రేమా నకిలీ!

మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఇలాంటివి బయటికి చెబితే పరువు పోతుందని చాలా మంది సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అందుకే ఫిర్యాదుల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. ఏఐతో అందమైన ముఖాన్ని సృష్టించవచ్చు. గొంతును మార్చవచ్చు. ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని కల్పించవచ్చు. చివరకు ఒక ప్రేమకథనే సృష్టించవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. ఏఐ మాయలో పడి జీవితాన్ని, డబ్బును కోల్పోకండి.

Also Read: మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

Tags

Related News

iPhone 20 Proలో ఊహించని మార్పు.. డైనమిక్ ఐలాండ్ విషయంలో యాపిల్ ప్లాన్ ఇదేనా?

వీఐ రూ.398 ప్లాన్.. కాలింగ్, 5G డేటాతో పాటు.. 19 ఓటీటీలు ఉచితం!

ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ..రూ.1,899కే అగారో రాయల్ కాఫీ మేకర్‌

వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!

నలుగురికి ఒక్కటే రీఛార్జ్.. Airtel రూ. 1,449 ఫ్యామిలీ ప్లాన్ గురించి తెలుసా?

మీ ఫోన్ పోయిందా? డేటా, బ్యాంక్ ఖాతాలను కాపాడుకోవాలంటే వెంటనే ఈ 6 పనులు చేయండి!

రూ.799కే..ట్రిగ్గర్ పంక్‌హెడ్జ్ Z5 హెడ్‌సెట్ లాంచ్! డోంట్ మిస్

Big Stories

Advertisement
×