E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో.. ఒప్పో నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. త్వరలోనే ఇండియాలో లాంచ్!

బడ్జెట్ ధరలో.. ఒప్పో నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. త్వరలోనే ఇండియాలో లాంచ్!
Advertisement

Oppo Enco Air 5 India Launch: ఆడియో మార్కెట్లో స్మార్ట్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒప్పో (Oppo) బ్రాండ్.. త్వరలోనే తన సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ‘ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5’ (Oppo Enco Air 5) పేరుతో రాబోతున్న ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్ త్వరలోనే ఇండియాలో విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా హింట్ ఇచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేదికగా ఇవి అమ్మకానికి రానున్నట్లు కన్ఫర్మ్ అయింది. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ ఫీచర్లు, అంచనా ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.

గ్యాడ్జెట్ ఫీచర్ల వివరాలు:

Advertisement

ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5:
ఒప్పో ఎన్‌కో ఎయిర్ సిరీస్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దాని ప్రత్యేకమైన సెమీ-ట్రాన్స్‌పరెంట్ కేస్ డిజైన్. ఈ సరికొత్త ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 మోడల్‌లో కూడా కంపెనీ ఈ సిగ్నేచర్ డిజైన్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి తీసుకువస్తోంది. దీని కేస్ క్యాప్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఇయర్‌ బడ్స్ చాలా తక్కువ బరువుతో, ఇన్-ఇయర్ ఫిటింగ్‌తో రానున్నాయి. దీని వల్ల రన్నింగ్ చేస్తున్నప్పుడు, జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇవి చెవుల నుంచి అస్సలు జారిపడవు. లాంగ్ అవర్స్ పాటు మ్యూజిక్ విన్నా కూడా చెవులకు ఎలాంటి నొప్పి రాకుండా ఉండేలా దీనిని డిజైన్ చేశారు.

నెక్స్ట్ లెవెల్ సౌండ్ క్వాలిటీ :
ఆడియో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 లో పెద్ద సైజ్ డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించబోతున్నారు. ఇవి డీప్ బేస్ , క్రిస్టల్ క్లియర్ వోకల్స్‌ను అందిస్తాయి. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చేందుకు ఇందులో ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ , ఒప్పో లైవ్ ఆడియో సపోర్ట్ ఉండనుంది.

Advertisement

ఇక ఈ ఇయర్‌బడ్స్‌లో అత్యంత కీలకమైన ఫీచర్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ . ఇది చుట్టుపక్కల ఉండే అనవసరమైన ట్రాఫిక్ శబ్దాలు లేదా ఆఫీస్ గోల వంటి డిస్టర్బెన్స్‌లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీని వల్ల మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా పాటలు వినొచ్చు. కాలింగ్ కోసం ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉన్న మల్టిపుల్ మైక్రోఫోన్లు రాబోతున్నాయి. ఇవి రోడ్డుపై వెళ్తున్నప్పుడు వచ్చే గాలి శబ్దాలను తగ్గించి.. అవతలి వ్యక్తికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తాయి.

మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్ , కనెక్టివిటీ :
బ్యాటరీ బ్యాకప్ పరంగా ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 యూజర్లను అస్సలు నిరాశ పరచదు. ఈ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో కలిపి దాదాపు 35 నుంచి 40 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ టైమ్‌ను అందించగలవని టెక్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు.. కొన్ని గంటల పాటు నిరంతరాయంగా పాటలు వినవచ్చు. కనెక్టివిటీ కోసం ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్‌కు చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. అలాగే గేమర్స్ కోసం అల్ట్రా-లో లేటెన్సీ మోడ్ కూడా ఉంటుంది. దీని వల్ల పబ్జీ లేదా ఫ్రీ ఫైర్ లాంటి ఆటలు ఆడేటప్పుడు ఆడియో లాగ్ అస్సలు ఉండదు.

Also Read: రూ.2 వేలలోపు ‘బోట్’మ్యాజిక్.. రూ.4 వేల బడ్జెట్‌లో ‘వన్‌ప్లస్’ అరాచకం.. ఏది బెస్ట్?

ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 ధర ఎంత?
ఒప్పో ఎన్‌కో ఎయిర్ సిరీస్ ఎప్పుడూ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే.. అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలోనే సరికొత్త ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 మార్కెట్లో సుమారుగా రూ.2,499 నుంచి రూ. 2,999 ధరల మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్లు, లాంచ్ డిస్కౌంట్లతో కలిపితే ఇది ఇంకా తక్కువ ధరకే లభించవచ్చు.

అమెజాన్ ఆఫర్: అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ లోకి వచ్చింది. త్వరలోనే.. దీని అధికారిక లాంచ్ డేట్‌ను కంపెనీ ప్రకటించనుంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, బ్రాండెడ్ క్వాలిటీ ,పవర్‌ఫుల్ నోయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకునే వారికి ఈ రాబోయే ఒప్పో ఇయర్‌బడ్స్ ఒక బెస్ట్ ఆప్షన్ కానున్నాయి.

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×