E-Paper
Advertisement

Monal Gajjar : సినిమాలకు బిగ్ బాస్ బ్యూటీ గుడ్ బై.. త్వరలోనే అతనితో పెళ్లి..?

Monal Gajjar : సినిమాలకు బిగ్ బాస్ బ్యూటీ గుడ్ బై.. త్వరలోనే అతనితో పెళ్లి..?
Advertisement

Monal Gajjar : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మోనాల్ గజ్జర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. అల్లరి నరేష్ నటించిన సుడిగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో ఈమెకు అంతగా క్రేజ్ తగ్గలేదు.. ఆ తర్వాత అడపా తడప సినిమాల్లో నటించింది కానీ అవి కూడా పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈమె అందంతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.. బుల్లితెర టాప్ రీయాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొంది.. హౌస్ లో తన అందాలతో పాటుగా అఖిల్ తో ప్రేమాయణం నడిపింది.. అలా వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుంది ఏమో అని అప్పట్లో అందరూ అనుకున్నారు.. ఇక బిగ్ బాస్ తర్వాత హీరోయిన్ గా బిజీ అవుతుందని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. ప్రస్తుతం మోనాల్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో షికారు చేస్తుంది.. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సినిమాలకు మోనాల్ గుడ్ బై..

బిగ్ బాస్ లో తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది మోనాల్ గజ్జర్.. బిగ్‌బాస్ సీజన్ 4తో ఈ బ్యూటీ సుడి తిరిగిపోయింది. టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా, సెలబ్రిటీగా, టెలివిజన్ హోస్ట్‌గా మారిపోయింది.. బిగ్ బాస్ కు సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో ఈమె మెరిసేది.. ఆ తర్వాత కొన్ని స్పెషల్ షోలకు హోస్ట్ గా వ్యవహరించేది.. ఇటీవల బిగ్ బాస్ జోడి కి సంబంధించిన డాన్స్ షో కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే .. దీంతో పాటుగా పలు డ్యాన్స్, సింగింగ్ షోలకు జడ్జిగా వ్యవహారించింది.. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ వచ్చింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఆమె పెద్దగా కనిపించలేదని తెలుస్తుంది.. ప్రస్తుతం మోనాల్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త షికారు చేస్తుంది.. గత కొన్ని రోజుల క్రితం ఇలాంటి వార్తలే ఈమెపై వినిపించాయి.. అప్పుడు ఆమె పెద్దగా స్పందించలేదు. మరి ఇప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Advertisement

Also Read : సమంత ‘ మా ఇంటి బంగారం ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

హాట్ లుక్ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మోనాల్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉందన్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ తర్వాత ఈమె అల్లుడు అదుర్స్ మూవీ లో ఐటమ్ సాంగ్ లో కనిపించింది.. ఆ తర్వాత బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తూ వచ్చింది. ఈమధ్య సినిమాలలో కూడా కనిపించకపోవడంతో మోనాలి ఇప్పుడు ఏం చేస్తుంది అని ఆమె అభిమానులు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ప్రస్తుతం పలు బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.. రీసెంట్ గా బిగ్ బాస్ అఖిల్ తో చేసిన వీడియో ఒకటి బాగా ట్రెండ్ అయింది. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.. బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో ఎద అందాలను చూపిస్తూ కిర్రాక్ స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ మోనాల్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతుందా? లేదా? అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

సర్జరీ తర్వాత తొలిసారి దర్శనమిచ్చిన రామ్ చరణ్.. డ్యాషింగ్ లుక్ తో!

Big Stories

Advertisement
×