BigTV English

Apple : 2025లో రాబోతున్న 5 యాపిల్ ఐఫోన్స్ ఇవే

Apple : 2025లో రాబోతున్న 5 యాపిల్ ఐఫోన్స్ ఇవే

Apple : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ లో లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఎంతో గ్రాండ్ గా టాప్ 20 గ్రాడ్జెట్స్ ను లాంఛ్ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. వీటిలో హై ఎండ్ ఐఫోన్స్ కూడా ఉన్నాయి. ఇక యాపిల్ ఏడాది ఐదు ఐఫోన్ మోడల్స్ ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.


టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది 5 ఐఫోన్ మోడల్స్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. వీటిలో లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు అదిరిపోయే అప్డేట్స్ కూడా ఉండనున్నాయి. ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్ తో పాటు ఐఫోన్ 17 సిరీస్ లో నాలుగు మొబైల్స్ లో తీసుకురావడానికి యాపిల్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం.

ఐఫోన్ SE 4 –


యాపిల్ కంపెనీ తీసుకొచ్చి ఐఫోన్స్ అన్నిటిలో ఇదే తక్కువ ధర అని చెప్పవచ్చు. ఈ మోడల్ అతి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో వచ్చేస్తుంది. ఐఫోన్ 16E మోనికర్ తో 16 సిరీస్ లో ఈ మొబైల్ భాగంగా వచ్చేస్తుందని టెక్ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు మొబైల్స్ లాంఛ్ అయ్యి స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇక 2025లో రాబోతున్న మోడల్ ఫేస్ ఐడి టెక్నాలజీతో పాటు ఆపిల్ తాజాగా తీసుకువచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఉండనున్నాయి. ఈ మొబైల్ ధర రూ.50,000లోపే ఉండే అవకాశం ఉంటుంది.

ఐఫోన్ 17 సిరీస్ –

ఆపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐఫోన్ 17 సిరీస్ ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొబైల్స్ ను తీసుకొస్తుంది. ఈ మొబైల్స్ అన్ని కూడా హై ఎండ్ ఫీచర్స్ తో రాబోతున్నాయి.

ఐఫోన్ 17 –

ఐఫోన్ 17 విషయానికి వస్తే… హై రిఫ్రెష్ రేట్ తో పాటు అదిరిపోయే డిస్ప్లే ఈ మొబైల్ లో ఉండబోతుంది. ఆపిల్ ప్రో చిప్ సెట్ తో రాబోతున్న ఈ మొబైల్ లో కొత్త హార్డ్వేర్ సిస్టమ్ ఉండబోతుంది.

ఐఫోన్ 17 స్లిమ్

ఐఫోన్ తీసుకురాబోతున్న ఈ స్లిమ్ మోడల్ 5.5mm కొలతలతో రాబోతున్నట్టు తెలుస్తోంది. దీంట్లో బ్యాక్ కెమెరా ఫీచర్ అద్భుతంగా ఉండనుందని.. బ్యాటరీ కెపాసిటీ తో పాటు డిస్ప్లే, ప్రాసెసర్ ఫీచర్స్ కూడా అదిరిపోయేలా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆపిల్ తీసుకొస్తున్న ఈ స్లిమ్ మోడల్ ధర రూ. లక్ష వరకు ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్ విషయానికి వస్తే యాపిల్ ఫ్లాగ్ షిప్ లో ఈ మొబైల్స్ కొత్త డిస్ప్లే తో రాబోతున్నాయి. అండర్ డిస్ప్లే, కెమెరాను ఈ మొబైల్స్ లో అందించడానికి యాపిల్ ట్రై చేస్తుంది. పెరిస్కోప్ లెన్స్ తో రాబోతున్న ఈ మొబైల్స్ లో అదిరిపోయే అప్ గ్రేడ్స్ సైతం ఉండనున్నాయి, వీటి ధర సైతం కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉండనుంది

ALSO READ : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్..

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×