Kannappa: టాలీవుడ్‌లో త్వరలో రాబోతున్న క్రేజియస్ట్ ప్రాజెక్ట్ లలో ఒకటి కన్నప్ప. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ క్యాస్టింగ్ మాత్రమే కాదు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రెబెల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో రిలీజైన టీజర్, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ.. కన్నప్ప మూవీపై అంచనాలు అమాంతం పెంచేశాయనే చెప్పాలి.
అందరికీ కృతజ్ఞతలు
ఇటీవల ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన విష్ణు ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ముందుగా అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అలా జరిగితే అందరి సమయంతో బడ్జెట్ కూడా ఆదా చేయగలం. ఈ మూవీ నా కెరీర్ పరంగా పెద్ద బడ్జెట్‌తో రాబోతున్న సినిమా అనే చెప్పాలి. ఈ మూవీ ఎంత భారీగా ఖర్చు పెడుతున్నామో అంతే స్ధాయిలో టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నారు. దాదాపు 600 మంది సిబ్బంది తో పాటు థాయిలాండ్ నుండి మరో 197 మంది సెట్‌లో పనిచేస్తున్నారు. దాదాపు ఐదు నెలలు వాళ్లు పడ్డ కష్టానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇష్టమైన చిత్రాలలో తెలుగు వెర్షన్ భక్త కన్నప్ప కూడా ఉంది. ఇప్పటికే ఆ సినిమా వెర్షన్‌ను చాలాసార్లు చూశాను’’ అని తెలిపాడు మంచు విష్ణు.
హాలీవుడ్ మూవీ రేంజ్‌లో
‘‘దర్శకుడు తనికెళ్ళ భరణి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తన వద్ద ఉన్న కథను చెప్పినప్పుడు నేను ఆసక్తిగా ఉన్నాను. మేము గతంలో చాలా నెలలు స్క్రిప్ట్‌పై పనిచేశాము. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మరో డైరెక్టర్‌తో తెరకెక్కించాల్సి వచ్చింది. కన్నప్ప మూవీని హాలీవుడ్ మూవీ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తరహా మూవీలా చూసిన ఆడియన్స్ ఫీల్ అయ్యేలా ఈ మూవీ మేకింగ్ ఉండేలా చూస్తున్నాం’’ అంటూ ‘కన్నప్ప’ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు విష్ణు. ఆసక్తికర విషయం ఏంటంటే.. విష్ణు తండ్రి మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో నటించగా, అతని నలుగురు పిల్లలు కూడా కన్నప్పలో భాగమయ్యారు. ఈ ప్రతిష్టాత్మక మూవీలో మూడు తరాలను ఆడియన్స్ చూడవచ్చు. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఏ రేంజ్‌లో హిట్ కొడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read: నేను ఏ దేశానికి పారిపోలేదు.. ఎవరికీ భయపడను అంటున్న విష్ణు..!
ఫ్యామిలీ గొడవలు
గత కొన్నిరోజులుగా మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ముందుగా తండ్రీ, కొడుకుల మధ్య మొదలయిన ఆస్తి వివాదం చాలా సీరియస్‌గా మారింది. అలా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఏం జరుగుతుందా అని ప్రేక్షకుల ఫోకస్ కూడా చాలానే పెరిగింది.