EPFO : ఈపీఎఫ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. పీఎఫ్ చందాదారుల పేరు, పుట్టిన తేదీ వంటి తదితర వివరాలను ఇకపై సులభంగా మార్చుకోవచ్చని తెలిపింది.
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పీఎఫ్ చందాాదారుల పేరు, పుట్టిన తేదీతో పాటు మిగిలిన ముఖ్యమైన వివరాలను మార్చుకోవడం సులభతరం చేసింది. ఇందుకు యజమాని గాని ఈపీఎఫ్ఓ ఆమోదం కానీ అవసరం లేకుండా ఆన్లైన్ లోనే సులువుగా మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఇందుకోసం ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి మాత్రం ఉంది.
ఈ-కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ ఖాతాదారులను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన రెండు సేవలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు. ఈ సర్వీస్ తో ఈపీఎఫ్ఓ ప్రక్రియ సులభతనం కావడంతో పాటు ఎంప్లాయర్ పై పని ఒత్తిడి సైతం తగ్గుతుందని తెలిపారు.
తాజా మార్పులతో ఈపీఎఫ్ చందాదారులకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే –
ఈపీఎఫ్ చందాదారులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలైన పేరు, పుట్టిన తేదీ, జెండర్, నేషనాలిటీ, తల్లీ తండ్రి పేరు, వివాహస్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, రిటైర్మెంట్ తేదీ వంటి వివరాలను తేలికగా మార్చుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో తేలిగ్గా తప్పులు దొర్లే అవకాశం ఉండటంతో ఈపీఎఫ్ఓ ఈ అవకాశాన్ని కల్పించింది.
2017 అక్టోబర్ ఒకటో తారీఖు తర్వాత యూఏఎన్ చందాదారులు ఈ కొత్త సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వివరాలు మార్చుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
2017 అక్టోబర్ 1 కంటే ముందు జాయిన్ అయిన యుఏఎన్ చందాదారుల విషయంలో కొన్ని మార్పులు చేసింది. వీళ్లు ఎలాంటి డీటెయిల్స్ మార్చుకోవాలన్నా అప్పగించాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను చాలా వరకు తగ్గించింది.
ఆధార్ తో లింక్ చేయబడని ఖాతాల విషయంలో మార్పు చేయాల్సి వచ్చిన సందర్భంలో మాత్రమే ఫిజికల్ డాక్యుమెంట్స్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇలాంటి వాళ్లు వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత ఈపీఎఫ్ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుందని తెలిపింది.
నిజానికి ఉద్యోగంలో చేరినప్పుడు పర్సనల్ డీటెయిల్స్ విషయంలో చాలా తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మార్పులు చేయడానికి ఆన్లైన్ లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ప్రక్రియ పూర్తవడానికి చాలా సమయం పడుతుందని.. కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8 లక్షల రిక్వెస్ట్ లు వచ్చాయని కార్మిక శాఖ మంత్రి తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. తాజా నిర్ణయంతో 40 శాతం మందికి తక్షణమే ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 50% మార్పులు యజమాని దగ్గర పరిష్కారం కానున్నాయని తెలిపారు.
ఇక ఉద్యోగం మారినప్పుడు సైతం ఈపీఎఫ్ అకౌంట్ ను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుందని.. ఈ-కేవైసీ పోస్ట్ చేసిన చందాదారులు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి యజమాని లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని కూడా వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా పంపిన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ప్రస్తుతం ఎంప్లాయ్ వద్ద పెండింగ్ లో ఉంటే వెంటనే డిలీట్ చేసి నేరుగా ఈపీఎఫ్ఓకే అభ్యర్థన పెట్టుకోవచ్చని కూడా తెలిపారు.
ALSO READ : ఇన్టాగ్రామ్ లో టిక్ టాక్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే!