Krishna District: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప తొక్కిసలాట జరగడంతో, ఓ చిన్నారి స్పృహ తప్పినట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పవన్ కళ్యాణ్ నేడు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గొడవర్రు గ్రామం వద్దకు కాన్వాయ్ రాగానే భారీగా అభిమానులు, ప్రజలు గుమిగూడారు. అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ వేణు వెంటనే కృష్ణా జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లా అభివృద్ధిపరమైన అంశాలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సైతం పవన్ ప్రారంభించారు. తమ జిల్లాకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు కృష్ణా జిల్లా ప్రజలు. గ్రామ గ్రామాన భారీగా గుమికూడి, హారతులు పట్టారు.
అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు సైతం గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ గొడవర్రు గ్రామం వద్దకు రాగానే భారీ జన సమూహం చేరింది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు సైతం శ్రమించాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు వచ్చిన ఓ బాలిక ఉన్నట్టుండి ఊపిరాడక స్పృహ తప్పింది. బాలిక స్పృహ తప్పడంతో వెంటనే స్థానికులు బాలికకు అక్కడే ప్రధమ చికిత్స అందించారు.
Also Read: Pawan Kalyan: పవన్ పర్యటన.. మన్యంలో అసలేం జరుగుతోంది?
అనంతరం కుటుంబ సభ్యుల కు సమాచారం అందించి ద్విచక్ర వాహనంపై బాలికను వైద్యశాలకు తరలించారు. బాలిక భయాందోళన చెంది స్పృహ తప్పినట్లు వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. బాలికకు అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపిన వైద్యులు ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు, బాలిక ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు.