BigTV English

YS Jagan : ఇక నేరుగా అసెంబ్లీకి.. ఈసారి మారం చేయకుండానే..

YS Jagan : ఇక నేరుగా అసెంబ్లీకి.. ఈసారి మారం చేయకుండానే..

YS Jagan : కౌరవ కూటమి సభలో నేనుండను, ప్రతిపక్ష నేతగా తగిన హోదా ఇవ్వనప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నేను సభలో ఖాళీగా ఉండాల్సిన అవసరం ఏంటి. ఇవీ.. కొన్నాళ్ల క్రితం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీకి వెళ్లనంటూ బహిరంగానే ప్రకటించారు. ప్రజల సమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీని బహిష్కరించారు. ఉమ్మడి ఏపీ విడిపోయిన మొదటి ఎన్నికల్లో ఇలానే వ్యవహరించి, రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా అధికారం సంపాదించిన జగన్.. ఈసారి అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అని అంతా అనుమానించారు. కానీ.. ఏమైందో ఏమో కానీ తాను అసెంబ్లీకి వస్తానని జగన్ ప్రకటించారు. ఇకపై తన గళాన్ని అసెంబ్లీ వేదికగా వినిపిస్తానంటూ తెలిపారు. ఈ మార్పులకు కారణం ఏంటి.. దారి లేక, మరో దిక్కు లేక ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చిందా.. అంటూ సెటైర్లు పేలుతున్నాయి.


మడమ తిప్పని నేత, చెప్పిన మాటకు కట్టుబడే నేత అంటూ వైసీపీ వర్గాలు పొగడ్తలతో ముంచెత్తే జగన్.. అసెంబ్లీకి హాజరు విషయంలో పట్టు విడిచారు. రానంటే రాను అంటూ గత అసెంబ్లీ సెషన్ కు బహిష్కరించిన ఈ కీలక నేత.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను పాల్గొంటున్నట్లు ప్రకటించారు. దాంతో.. జగన్ ఆలోచనలు ఏంటి అనే విషయమై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి.. జగన్ చుట్టు ఉండే కొటరి.. చాలా బలంగా జగన్ తరఫున వాదిస్తుంటారు. టీవీ కార్యక్రమాలు అయినా, ప్రెస్ మీట్లు అయినా వైసీపీ నాయకులు ఎంటర్ అయితే వైసీపీ తరఫున గట్టిగా నిలబడే వారు. కానీ, ప్రస్తుతం ఘోర అవమాన భారంతో చాలా మంది సీనియర్ నాయకులు బయటకు రావడం లేదు. పార్టీ అభిప్రాయాల్ని, పార్టీ ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. జగన్ వైఖరి మార్పు విషయంలో ఇదీ ఓ కోణం అంటున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత చాలా మంది నేతలు వైసీపీని వీడారు. కొందరు కూటమి పార్టీల్లో ఏదో ఓ దాంట్లో చేరితే మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో ఇన్నాళ్లు నంబర్ టూ గా ఉన్న విజయ సాయి రెడ్డి సైతం పార్టీని వీడడంతో ప్రజల్లో పార్టీ బలహీనపడింది అన్న అభిప్రాయం పెరిగిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. పైగా.. సీనియర్లు పార్టీని వీడుతుండడంతో.. జిల్లాలో వారి తర్వాతి శ్రేణి నాయకులకు సరైన భరోసా కరవై పార్టీని వీడేందుకు ఆసక్తిగా ఉన్నారని, పార్టీకి అండగా నిలిచేందుకు భయపడుతున్నారన్న వార్తలు రాజకీయ సర్కిళ్లల్లో తిరుగుతున్నాయి. ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని, పార్టీ బలంగా ఉందని, కొందరు నాయకులు వీడిపోయినంత మాత్రన ఇబ్బంది లేదని జగన్ నిరూపించాలని చూస్తున్నారని, అందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవచ్చని అంటున్నారు.


అలాగే.. గతంలో వైభవంగా కనిపించిన పార్టీ, ఇటీవల వెలవెలబోతుంది. పార్టీ ఆఫీసులు ముగబోతున్నాయి. కూటమి నేతలు సైతం నిత్యం ప్రజల్లో ఉంటూ.. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో పార్టీని కాపాడుకోకపోతే.. మరో రెండు ఎన్నికల వరకు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వైసీపీ వ్యూహకర్తలు అంచనాకు వచ్చారని టాక్. అందుకే.. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, పార్టీ గురించి చర్చించుకునే అవకాశం కల్పించేందుకు జగన్ అసెంబ్లీ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు.

Also Read : తణుకులో విషాదం.. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

పార్టీకి ఇటీవల కాలంలో ప్రచారం బాగా తగ్గింది. గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులు నిత్యం యాక్టివ్ గా ఉంటూ పార్టీ పట్ల ప్రజల్లో మంచి దృక్పథాన్ని పెంచారు. కానీ.. ఇప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ పరిష్కారంగానే తాను ముందుండి పార్టీని నడిపించాలని జగన్ భావిస్తున్నారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. తాను ముందుండి ప్రస్తుత సమస్యలను ఎదుర్కొంటే.. తన సైన్యం ధైర్యంగా ముందుకు వస్తుందని అనుకుంటున్నారు అంటూ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×