Apple iPad Mini 8: యాపిల్ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘ఐపాడ్ మిని 8’కి సంబంధించి ఆసక్తికరమైన లీక్స్ బయటకొచ్చాయి. ప్రతిసారి కొత్త మోడల్ రాగానే డిస్ప్లే, ప్రాసెసర్ విషయంలో పెద్ద మార్పులే ఉంటాయని మనం అనుకుంటాం. అయితే ఈసారి Apple iPad Mini 8 విషయంలో కొన్ని మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్స్ ఉన్నా.. మరికొన్ని విశ్లేషకులను కాస్త నిరాశకు గురిచేస్తున్నాయి. అసలు ఈ కొత్త ఐపాడ్‌లో ఏమేం రాబోతున్నాయి, ఏ విషయాల్లో ఆశించిన స్థాయిలో మార్పులు లేవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కొత్త Apple iPad Mini 8లో డిస్ప్లే పరంగా ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. పాత ఎల్‌సీడీ స్థానంలో ఈసారి ఓఎల్ఈడీ డిస్ప్లేను అందిస్తున్నారు. దీనివల్ల కలర్స్ చాలా స్పష్టంగా, కాంట్రాస్ట్ అద్భుతంగా కనిపిస్తుంది. వీడియోలు చూసేటప్పుడు ఓఎల్ఈడీ అనుభవమే వేరు. అయితే అందరూ ఆశించినట్టుగా ఇందులో 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్ ఇవ్వడం లేదు. సాధారణ 60Hz ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ ప్యానెల్‌నే ఉపయోగిస్తున్నారు. స్మూత్ స్క్రోలింగ్ కోరుకునే వారికి ఇది కాస్త చిన్న నిరాశే అని చెప్పాలి.
Also Read: మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!
పెర్‌ఫార్మెన్స్ విషయంలో మాత్రం యాపిల్ ఎక్కడా తగ్గడం లేదు. ఇందులో ఏ20 ప్రో చిప్‌సెట్ వాడబోతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పాత మోడళ్లతో పోలిస్తే వేగం, గ్రాఫిక్స్ చాలా మెరుగ్గా ఉంటాయి. అంతేకాకుండా యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లకు ఇది సరైన సపోర్ట్ ఇస్తుంది. రోజువారీ పనులతో పాటు హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసేవారికి ఈ ప్రాసెసర్ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని భావించవచ్చు.
వీడియో కాల్స్ మాట్లాడే వారి కోసం ఫ్రంట్ కెమెరా స్థానాన్ని మార్చారు. ల్యాండ్‌స్కేప్ మోడ్‌కి సరిపోయేలా కెమెరాను అమర్చడం వల్ల హారిజాంటల్‌గా పెట్టినప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా సులువుగా ఉంటుంది. వీటితో పాటు స్పీకర్ సిస్టమ్‌ను మరిన్ని హంగులతో తీర్చిదిద్దారు. అలాగే వాటర్ రెసిస్టెంట్ బాడీతో ఇది వచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాటరీ లైఫ్, స్టోరేజ్ వేరియంట్లు మరియు ధరపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ Apple iPad Mini 8 ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 13న జరిగే ఈవెంట్‌లో స్మార్ట్ హోమ్ హబ్, కొత్త యాపిల్ టీవీ 4కేతో పాటు దీనిని విడుదల చేస్తారని కొందరు అంటుంటే.. మరికొందరు అక్టోబర్ 27న మరొక ఈవెంట్ ఉందంటున్నారు. దీంతో యాపిల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!