E-Paper
Advertisement

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!
Advertisement

Earbuds Under 2000: స్మార్ట్‌ఫోన్‌తో పాటు వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కూడా ఇప్పుడు నిత్యావసర గ్యాడ్జెట్‌గా మారిపోయాయి. ఇష్టమైన పాటలు వినాలన్నా, ఆఫీస్ కాల్స్ మాట్లాడాలన్నా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే, మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న బడ్స్ కొనాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026లో రూ.2,000 లోపే అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన టాప్ TWS ఇయర్ బడ్స్‌ను ఆకర్షణీయమైన ధరలకు సొంతం చేసుకోవచ్చు.

అత్యంత తక్కువ ధరలోనే..

మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే pTron Bassbuds Astra, Hammer Airflow Neo మోడల్స్ బెస్ట్ ఛాయిస్. ఈ సేల్‌లో ఇవి రెండూ కేవలం రూ.599కే లభిస్తున్నాయి. అలాగే రూ.749 ధరకే లభిస్తున్న Mivi DuoPods Echo కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి ఎంపిక. వీటితో పాటు రూ.3,499 ఉన్న boAt Airdopes Plus 222 మోడల్‌ను ఈ సేల్‌లో రూ.799కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

రూ.1,500 లోపు మోడల్స్..

కొంచెం మంచి క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఆశిస్తుంటే రూ.1,499 బడ్జెట్‌లో కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. బోట్ నిర్వాణ ఐయాన్ అసలు ధర రూ.7,990 కాగా, సేల్‌లో కేవలం రూ.1,499కే వస్తోంది. దీంతో పాటు GoBolt Mustang Torque, TruckBuds Liberty మోడల్స్ కూడా ఇదే రూ.1,499 ధరకు అందుబాటులో ఉన్నాయి. పాటలు వినడానికి, రోజూవారీ వాడకానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

బ్రాండెడ్ ఆప్షన్ల కోసం..

Advertisement

రూ.1,500 కంటే కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టగలము అనుకుంటే OnePlus Nord Buds 3R మంచి ఎంపిక. దీని అసలు ధర రూ.1,999 కాగా, సేల్‌లో రూ.1,599కి లభిస్తోంది. వన్‌ప్లస్ నుంచి వచ్చే ఉత్పత్తులకు మంచి క్రేజ్ ఉంటుంది కాబట్టి.. ఈ ధరలో ఇది మంచి ఆఫర్ అని చెప్పవచ్చు. బ్రాండ్, సౌండ్ క్వాలిటీ ముఖ్యం అనుకునేవారు ఈ మోడల్‌ను నిరభ్యంతరంగా పరిశీలించవచ్చు.

ప్రీమియం బడ్జెట్ డీల్..

రూ.2,000 బడ్జెట్ శ్రేణిలో almi T310 ఇయర్ బడ్స్ టాప్‌లో నిలుస్తాయి. రూ.3,999 ఎమ్ఆర్‌పి ఉన్న ఈ బడ్స్‌ను ఆఫర్‌లో రూ.1,799కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ధరకు రాబట్టాలంటే ఎలిజిబుల్ బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి.. ప్రొడక్ట్ కొనేముందు మీ బ్యాంక్ కార్డ్ ఆఫర్ సరిగ్గా వర్తిస్తుందో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

Also Read: మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

Tags

Related News

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు

బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్

పొలం లేదు.. దుక్కి దున్నేది లేదు.. అయినా పంటలు పండుతాయి!

Big Stories

Advertisement
×