BigTV English
Advertisement

Apple iPhone Risk : యాపిల్ తో తప్పదు ముప్పు.. ఐఫోన్ 16తో పాటు iPad, MacBook, Watchesకు పొంచి ఉన్న ప్రమాదం

Apple iPhone Risk : యాపిల్ తో తప్పదు ముప్పు.. ఐఫోన్ 16తో పాటు iPad, MacBook, Watchesకు పొంచి ఉన్న ప్రమాదం

Apple iPhone Risk : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్.. తన వినియోగదారుల భద్రతే లక్ష్యంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ మెుబైల్స్ ను తీసుకొస్తుంది. యాపిల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాని.. లేటెస్ట్ సాఫ్ట్ వేర్స్ ను అప్డేట్ చేసుకోవాలని హెచ్చరిస్తుంది. ఇక తాజాగా భారత ప్రభుత్వ నోడల్ సెక్యూరిటీ ఏజెన్సీ సైతం యాపిల్ యూజర్స్ కు కొత్త భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యాపిల్ భద్రతపై మరోసారి జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే భారత్ ప్రభుత్వం ఏమన్నది.. ఏ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందనే డీటెయిల్స్ మీకోసమే.


భారత్లో యాపిల్ వాడే వినియోగదారులకు ప్రమాదం పొంచి ఉందని నోడల్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఇక ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) సైతం ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఐఫోన్‌, Mac బుక్ తో పాటు పలు Apple పరికరాలలో సమస్య ఉందని.. ఈ ప్రమాద తీవ్రతను తక్కువగా అంచన వేయరాదని తెలిపింది. అయితే అసలు ఆపిల్ ప్రొడెక్ట్స్ లో వేటికి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.

iPhone, iPad, MacBooksతో పాటు Apple నుంచి లాంఛ్ అయిన వాచెస్ కు సైతం ప్రమాదం పొంచి ఉంది. ఇక iOS, iPadOS, macOS, tvOS, watchOS, visionOSతో పాటు Safari లో ఉండే లేటెస్ట్ వెర్షన్‌లలో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక సెక్యూరిటీ సమస్యల్లో భాగంగా స్మార్ట్ ఫోన్ లో డేటా ప్రాసెస్ కాకపోవటం, సున్నితమైన సమాచారం హ్యాక్ అవ్వటం, మానిప్యులేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


యాపిల్ సెక్యూరిటీ రిస్క్(High Risk Apple Devices) లో ఉన్న డివైజెస్ ఏంటంటే..

1. iOS and iPadOS versions prior to 18.1
2. iOS and iPadOS versions prior to 17.7.1
3. macOS Sequoia versions prior to 15.1
4. macOS Sonoma versions prior to 14.7.1
5. macOS Ventura versions prior to 13.7.1
6. watchOS versions prior to 11.1
6. tvOS versions prior to 18.1
7. visionOS versions prior to 2.1
8. Safari versions prior to 18.1

భద్రతా సమస్యల విషయంలో యాపిల్ ఐఫోన్ 16 తో పాటు తాజాగా లాంఛ్ అయిన ఆపిల్ ప్రొడక్ట్స్ కూడా ఉండటం కంగారు పెట్టే విషయమే. తాజాగా విజన్ ప్రో హెడ్‌సెట్, ఐప్యాడ్, ఐపాడ్ ప్రో మోడల్స్ తో పాటు యాపిల్ లాంఛ్ చేసిన వెర్షన్స్ లో పాత మోడల్స్ అయిన ఐఫోన్8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X వంటి పాత మోడల్స్ సైతం ఉన్నాయి. ఇక యాపిల్ టీవీ, ఆపిల్ వాచ్ వాడే యూజర్స్ సైతం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

ఇక యాపిల్ వాడే యూజర్స్ ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్స్ ను అప్డేట్ చేస్తూ ఉండాలి. కొత్తగా కొన్న మెబైల్, యాపిల్ ప్రొడెక్ట్స్ తో పాటు పాత ఫోన్స్ లో సైతం లేటెస్ట్ వెర్షన్స్ ను అప్డేట్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది.

ALSO READ : Google సర్చ్ తో విసిగిపోయారా? ChatGPTను డిఫాల్ట్ సర్చ్ గా మార్చేసుకోండిలా..

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×