E-Paper
Advertisement

అలారం, డోర్‌బెల్, చిన్న పిల్లలు ఏడుపు.. అన్నింటినీ పసిపట్టేసే Apple Watch Series 12!

అలారం, డోర్‌బెల్, చిన్న పిల్లలు ఏడుపు.. అన్నింటినీ పసిపట్టేసే Apple Watch Series 12!
Advertisement

Apple Watch Series 12: ప్రపంచవ్యాప్తంగానే కాదు.. భారతదేశంలోనూ యాపిల్ వాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హెల్త్ ట్రాకింగ్, ఫిట్‌నెస్ ఫీచర్లతో పాటు రోజూ చేతికి పెట్టుకోవడానికి కంఫర్ట్‌గా ఉండటం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఈ లైనప్‌లోకి కొత్తగా Apple Watch Series 12 వచ్చేసింది.

కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు, హెల్త్ ట్రాకింగ్ సామర్థ్యాలతో ఇది వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీంతో భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలోనూ కొత్త యాపిల్ వాచ్‌పై ఆసక్తి పెరిగింది. మరి ఈ కొత్త వాచ్‌లో ఏమేం ఉన్నాయి? ధర ఎంత? బ్యాటరీ ఎలా ఉంది.. వంటి విషయాలు తెలుసుకుందామా..

ధర ఎంతంటే?

Advertisement

భారత్‌లో ఈ కొత్త యాపిల్ వాచ్ సిరీస్ 12 ధర రూ.56,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్స్ కూడా మొదలైపోయాయి. సెప్టెంబర్ 18 నుంచి అధికారికంగా సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఎవరైనా దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. స్పేస్ గ్రే, బ్లాక్, లైట్ గోల్డ్, డార్క్ బ్రాంజ్ రంగుల్లో అల్యూమినియం వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రీమియం లుక్ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా టైటానియం, సెరామిక్ ఫినిషింగ్ ఆప్షన్లను కూడా యాపిల్ తీసుకువచ్చింది.

Also Read: Whatsappలో ఇక మెసేజ్ లాగే మనీ ట్రాన్స్‌ఫర్.. ఫోన్‌పే, గూగుల్ పేలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం!

38 గంటల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఈ Apple Watch Series 12లో వాడిన ఎస్11 ప్రాసెసర్ దీని పనితీరును పూర్తిగా మార్చేసింది. హెల్త్ ఫీచర్లు, ఇతర స్మార్ట్ యాప్స్ అన్నీ చాలా స్మూత్‌గా రన్ కావడానికి ఈ కొత్త చిప్ బాగా పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 38 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. మనం వాడే పద్ధతిని బట్టి ఈ టైమింగ్ కొంచెం మారొచ్చు కానీ, సాధారణ వాచ్‌ల కంటే ఇది చాలా ఎక్కువ సమయం వస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో సిరామిక్ షీల్డ్ వాడారు. దీనివల్ల పాత మోడల్స్‌తో పోలిస్తే డిస్‌ప్లే పగిలిపోకుండా దాదాపు 60% వరకు ఎక్కువ రక్షణ లభిస్తుంది.

రియల్‌టైమ్ హెల్త్ అప్డేట్స్:

యాపిల్ వాచ్ అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది హెల్త్ ట్రాకింగే. ఈసారి దీన్ని మరింత పర్ఫెక్ట్‌గా మార్చారు. ఈసీజీ తీసుకునే సమయంలో చర్మానికి బాగా టచ్ అయ్యేలా ఎలక్ట్రోడ్లను పెద్దవిగా చేశారు. గుండె కొట్టుకునే వేగాన్ని కచ్చితంగా కొలవడానికి గ్రీన్ ఎల్ఈడీ లైట్లను మరింత పవర్‌ఫుల్‌గా అమర్చారు. మనం నడిచేటప్పుడు లేదా వర్కవుట్లు చేసే సమయంలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా హార్ట్ రేట్ కచ్చితంగా చూపించేలా ఈ కొత్త సెన్సార్లు పనిచేస్తాయి. రోజువారీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించుకోవడానికి ఇదొక మంచి డివైస్ అని చెప్పొచ్చు.

లైవ్ రివైండ్ ఫీచర్:

ఈ వాచ్‌లో కొన్ని వినసొంపైన, ఆశ్చర్యకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. మన చుట్టుపక్కల ఏదైనా అలారం మోగినా, డోర్‌బెల్ శబ్దం వినిపించినా లేదా చిన్నపిల్లలు ఏడ్చినా ఈ వాచ్ సౌండ్ రికగ్నిషన్ ద్వారా ఆటోమేటిక్‌గా పసిగట్టి మనకు అలర్ట్ ఇస్తుంది. అంతేకాదు.. గత 15 సెకన్లలో ఎవరైనా మాట్లాడిన మాటలను స్క్రీన్ మీద టెక్స్ట్ రూపంలో చూపించే లైవ్ రివైండ్ అనే అద్భుతమైన ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీనికి తోడు కొత్త సిరి ఏఐ సపోర్ట్, పర్సనల్ వెల్నెస్ అసిస్టెంట్ మనకు రోజూ తగిన ఆరోగ్య సలహాలు ఇస్తూ ఒక పర్సనల్ ట్రైనర్‌లా తోడుగా ఉంటాయి.

Also Read: రూ.500 లోపు బెస్ట్ టైప్-సి, 3.5ఎంఎం ఇయర్ ఫోన్స్.. వీటికి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్!

Tags

Related News

ఐస్‌క్రీమ్‌కు బదులుగా ఈ కొరియన్ డెజర్ట్ ట్రై చేయండి.. టేస్ట్ అమోఘం!

దుబాయ్‌లో ఐఫోన్ చౌక అని కొంటున్నారా? ఈ తప్పు చేస్తే మీ డబ్బులు గోవిందా!

అమ్మ బాబోయ్.. రూ.1.30 లక్షల విలువైన స్మార్ట్ టీవీ జస్ట్ రూ.64 వేలకే వచ్చేస్తోంది!

రూ.1.75 లక్షల శాంసంగ్ ఫోన్ ఇంత చౌకగానా? రూ.45 వేల డిస్కౌంట్‌తో అదిరిపోయే డీల్!

అమెజాన్ రీలోడెడ్ సేల్.. రూ.699కే బ్రాండెడ్ పవర్ బ్యాంక్.. మిస్ అయితే ఫీలవుతారు మామా!

మనిషి అనుమతి లేకుండానే ఎన్నికల డేటా యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ..

మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఫొటో, గేమింగ్ యాప్స్ లొకేషన్ ఎందుకు అడుగుతాయి?

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌పై బిగ్ అప్‌డేట్.. iPhone 17 కావాలంటే ఈ తేదీని అస్సలు మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×