Youtuber Nandana: యూట్యూబర్ నందన ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందుస్ వరల్డ్ (Nandus World)అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె ఇటీవల ఒక స్కాంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన భర్త మధుకర్ తో కలిసి డెస్టినీ కన్సల్టెన్సీ అనే పేరు గల సంస్థతో నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వీసా ఇప్పిస్తామంటూ అక్రమాలకు పాల్పడటమే కాకుండా బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధంగా నందన(Nandana) మధుకర్(Madhukar) పై లుక్ అవుట్ నోటీసులు ఉండడంతో ఇటీవల నందన ఇండియా రావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
వీసా స్కామ్ లో వీరిపై లుక్ ఔట్ నోటీసులు ఉన్నప్పటికీ ఈమె ఇండియా రావడానికి గల కారణం ఏంటనే చర్చ కూడా జరిగింది అయితే ఈమె బిగ్ బాస్ సీజన్ కార్యక్రమంలో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందుకే ఇండియా వచ్చారని తెలుస్తోంది. ఇలా నందన వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు రావడమే కాకుండా ఈమె రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వైల్డ్ కార్డు ద్వారా నందన హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం కోసం వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం.
నందన సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఫాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. అలాగే వీసా స్కామ్ లో భాగంగా ఈమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈమెను హౌస్ లోకి పంపిస్తే మంచి కంటెంట్ ఉంటుందని భావించి ఈమెకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నందన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈమెను మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోము అంటూ ఇప్పటికే పలువురు మహిళా నేతలు బిగ్ బాస్ టీంకు వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
నందన తన భర్తతో కలిసి ఎంతోమంది నిరుద్యోగులతో డబ్బు తీసుకొని మోసం చేశారు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ పలువురు రాజకీయ నేతలు బిగ్ బాస్ టీమ్ పై మండిపడుతున్నారు. మరి నిజంగానే నందన బిగ్ బాస్ కోసమే ఇండియా వచ్చారా? ఈమె వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్ళబోతున్నారా? ఇంత జరిగిన తర్వాత బిగ్ బాస్ నందనను కంటెస్టెంట్ గా తీసుకుంటున్నారా అనే విషయాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాలి.
Also Read: మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. కొత్త స్కిన్‌కేర్ బ్రాండ్ ఇదే!