Old Mobile Number: ఒకప్పుడు మెుబైల్ నెంబర్ కేవలం కాల్స్ మాట్లాడటానికి మాత్రమే వినియోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో మెుబైల్ నెంబర్ ఐడెంటిటీగా మారిపోయింది. బ్యాంకింగ్, యూపీఐ, ఓటీపీ, ఆధార్ లింకప్ ఇలా ప్రతీ దానికి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా మారిపోయింది. ఈ క్రమంలోనే నెట్టింట కొత్త ఆందోళనలు మెుదలయ్యాయి. కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేసిన వ్యక్తులు.. ఆ నంబర్‌తో వివిధ యాప్‌లలో లాగిన్ అయినప్పుడు.. ఆ నంబర్ గతంలో వాడిన పాత యజమాని వ్యక్తిగత వివరాలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఈ కథనంలో చూద్దాం.
టెలికాం నిబంధనల (TRAI) ప్రకారం.. ఒక సిమ్ కార్డ్‌లో వరుసగా 90 రోజుల పాటు (మూడు నెలలు) ఎలాంటి రీఛార్జ్ లేదా వినియోగం లేకపోతే టెలికాం కంపెనీ ఆ నంబర్‌ను ఇన్‌యాక్టివ్‌గా గుర్తిస్తుంది. ఆ తర్వాత సదరు నంబర్‌ను రీసైకిల్ చేసి మార్కెట్‌లో కొత్త కస్టమర్లకు విక్రయిస్తుంది. అయితే డీయాక్టివేట్ అయిన నంబర్లను టెలికాం కంపెనీలు రీ-ఇష్యూ చేయకుండా అడ్డుకోలేమని 2023లో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. కాబట్టి డేటాను భద్రపరుచుకునే బాధ్యత పూర్తిగా వినియోగదారులపైనే ఉందని చెప్పవచ్చు. కాబట్టి పాత నెంబర్ రద్దయితే వెంటనే చేయాల్సిన 4 ముఖ్యమైన పనులు గురించి చూద్దాం.
పాత నంబర్ నిలిచిపోయిన వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోండి. అలాగే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్‌ల ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాత నంబర్‌ను అన్‌లింక్ చేసి కొత్త నంబర్‌తో యూపీఐ ఐడీని అప్‌డేట్ చేయండి.
పాత నంబర్ డీయాక్టివేట్ కాగానే మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్స్‌లోని ‘పర్సనల్ ఇన్ఫర్మేషన్’ విభాగంలోకి వెళ్లండి. అక్కడ మీ కొత్త మొబైల్ నంబర్‌ను జతచేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి. తర్వాత పాత నంబర్‌ను పూర్తిగా తొలగించండి.
స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి యాప్‌ల ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో రద్దైన పాత నెంబర్ ను వెంటనే మార్చండి. ఒకవేళ పాత నంబర్‌తో లాగిన్ కావడం సాధ్యం కాకపోతే కొత్త నంబర్‌తో కొత్త ఖాతాను ప్రారంభించి.. పాత ఖాతాను డిలీట్ చేయడం బెస్ట్.
Also Read: పీతల పెంకులతో బ్యాటరీనా? శాస్త్రవేత్తల ప్రయోగం చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
టూ – ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) ఉపయోగిస్తున్న అన్ని సేవల్లోనూ రికవరీ నంబర్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి. అలాగే జీమెయిల్ లేదా ఇతర ఈమెయిల్ ఖాతాలకు లింక్ అయిన ఫోన్ నంబర్‌ను మార్చడం మర్చిపోవద్దు. దీనివల్ల లాగిన్ అలర్ట్స్ సరిగ్గా అందుతాయి.
Also Read: రూ. 2,000 కే వాషింగ్ మిషన్.. సైకిల్ పెడల్ తొక్కితే బట్టలు క్లీన్.. ఇదేదో భలే ఉందే!