Big Stories

Liger: లైగర్‌పై గరంగరం.. ఎగ్జిబిటర్ల ధర్నా.. చార్మి స్పందన..

liger exhibitors

Liger: లైగర్‌.. సాలా క్రాస్ బ్రీడ్. పరమ చెత్త సినిమా. అట్టర్‌ఫ్లాప్‌లకే బాప్. పాన్ ఇండియా సినిమా అంటూ తెగ బిల్డప్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ బాడీ చూపించి క్యాష్ చేసుకుందామని అనుకున్నారు. దేశమంతా తిరిగి మస్తుగా ప్రి-రిలీజ్ ఈవెంట్స్ చేశారు. ఫుల్ హైప్ తీసుకొచ్చి.. సినిమాను రిలీజ్ చేశారు. క్రేజీ కాంబినేషన్, బిగ్ ఎక్స్‌పెక్టేషన్స్ అని ఎగ్జిబిటర్లు భారీ మొత్తం చెల్లించి లైగర్‌ను కొనుక్కున్నారు. అర్జున్‌రెడ్డిలా హిట్ కొడుతుందని.. పండుగ చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ, రిలీజ్ షో తోనే తేలిపోయింది లైగర్. టాక్ మరీ బక్‌వాస్. మ్యాట్నీకి కూడా థియేటర్లు ఖాళీ. ఇంకేం.. నిండా మునిగారు ఎగ్జిబిటర్స్. దర్శకుడు పూరీనే నిర్మాత కూడా కావడంతో.. మా డబ్బులు మాకు ఇచ్చేయమంటూ లొల్లి లొల్లి చేశారు వారంతా.

- Advertisement -

లైగర్ మూవీని ఎగ్జిబిట్‌ చేసి తాము తీవ్రంగా నష్టపోయామని, నష్టాన్ని భర్తీ చేయాలంటూ నైజాం ఎగ్జిబిటర్లు అప్పట్లో హైదరాబాద్‌లోని పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేశారు. తనని బెదిరించకుండా ఉంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారు పూరీ. అయితే, ఆయన మాటిచ్చి ఆరు నెలలు దాటినా ఇంకా తమకు ఎలాంటి సొమ్ము తిరిగి ఇవ్వలేదంటూ లేటెస్ట్‌గా మరోసారి రోడ్డెక్కారు ఎగ్జిబిటర్స్.

- Advertisement -

లైగర్ నైజాం డిస్ట్రిబ్యూటర్‌.. తన ఆఫీస్‌ ఖాళీ చేసి పారిపోయాడని.. పూరీ సైతం తమ కాల్స్‌కు స్పందించడం లేదని.. తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు ఎగ్జిబిటర్స్. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

విషయం తెలిసి లైగర్ మరో నిర్మాత చార్మి స్పందించారు. త్వరలోనే అందరికీ న్యాయం చేస్తామని సమాచారం అందించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News