Big Stories

Smartphone Tips : మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతున్నట్లయితే ఈ పని చేయకండి!

Smartphone Tips : సమ్మర్ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్లు హీట్ ఎక్కడం సర్వసాధారణమైన అంశం. అంతే కాకుండా ఫోన్‌లో హెవీ టాస్కింగ్ చేయడం వల్ల కూడా ఫోన్లు వేడెక్కుతాయి. దీనివల్ల అనేక సమస్యలు తలెెత్తే అవకాశం ఉంది. ఫోన్ వేడెక్కడం వల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే హీట్ సమస్య అధికమవుతుంది. కాబట్టి ఫోన్ హీట్ అవకుండా ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకోవడం చాలా అవసరం ఉంది. మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

అయితే మీ వద్ద ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఉన్నా దానిని ఉపయోగించేందుకు కొంత టైమ్ లిమిట్ ఉంటుంది. మీరు చాలా గంటలు పాటు నిరంతరం ఫోన్‌లో హెవీ టాస్కింగ్ చేస్తుంటే ఫోన్ చాలా వేడిగా ఉండటానికి ఇదే అతిపెద్ద కారణం కావచ్చు. కాబట్టి మీరు స్మార్ట్‌ఫోన్లో హెవీ టాస్కింగ్ చేయకండి.

- Advertisement -

Also Read: మొబైల్ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. రూ.7,999లకే స్మార్ట్‌ఫోన్

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో ఫోన్‌ను సూర్యరశ్మిని నేరుగా తాకినట్లయితే అది వేడెక్కడం సమస్యను అధికం చేస్తుంది. అందువల్ల వినియోగదారులు ఫోన్‌‌పై నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి. లేదంటే ఫోన్ బ్యాటరీ పాడైపోయే ప్రమాదం ఉంది.

మల్టీ టాస్కింగ్ సమయంలో ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనేక యాప్‌లు ఒకేసారి రన్ అవుతున్నట్లయితే అది ఫోన్ హీటింగ్ సమస్యకు కారణమవుతుంది. ఫోన్‌‌లో ప్రాసెసర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉన్నా ఒకేసారి ఇన్ని యాప్స్ వాడటం వల్ల ఓవర్ హీటింగ్ సమస్య వస్తుంది. అందువల్ల మీరు ఉపయోగకరమైన యాప్స్ మాత్రమే వాడండి. మీకు అవసరం లేనివి ఫోన్ నుంచి తీసివేయండి.

Also Read : 108 MP కెమెరాతో అదిరిపోయే ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు వైరల్

ఫోన్ చాలా వేడిగా ఉంటే కొంత సమయం పాటు ఫోన్ బ్యాక్ కవర్ తొలగించండి. ఇలా చేయడం వల్ల వేడెక్కడం సమస్య‌ను చాలా వరకు పరిష్కరించవచ్చు. మీకు కావాలంటే, ఛార్జింగ్ చేసేటప్పుడు కూడా కవర్‌ని పక్కన పెట్టుకోవచ్చు. అసలు ఫోన్ బ్యాక్ కవర్ వాడకపోయిన మంచిదే అని నిపుణులు చెబుతునన్నారు.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News