Apple Watch Series 12: యాపిల్ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న యాపిల్ వాచ్ సిరీస్ 12కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. యూజర్ల అనుభవాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేలా కొన్ని క్రేజీ ఫీచర్లను ఇందులో జోడించారు. ముఖ్యంగా కొత్తగా వచ్చే S12 చిప్, వాచ్ ఓఎస్ 27తో ఈ స్మార్ట్‌వాచ్ మరింత ఫాస్ట్‌గా, తెలివిగా పనిచేస్తుందని తెలుస్తోంది.
డిస్‌ప్లే పరిమాణంలో మార్పులు లేకపోయినా.. బ్రైట్‌నెస్ విషయంలో యాపిల్ పెద్ద అడుగు వేసింది. ఏకంగా 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రావడం వల్ల ఎంతటి తీవ్రమైన ఎండలోనైనా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రాత్రి వేళల్లో కళ్లకు శ్రమ తగ్గించేలా 1 నిట్‌కి డిమ్ అయ్యే సదుపాయం కూడా ఉంది. నిరంతరం సమయాన్ని చూసుకునే ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లే, స్పష్టమైన విజువల్స్ ఇచ్చే లిక్విడ్ గ్లాస్ డిజైన్‌ను ఇందులో కొనసాగించారు.
Also Read: ఇదెక్కడి మాస్ డిస్కౌంట్ మావా.. Samsung Galaxy S26 Plusపై రూ.30,500 తగ్గింపు!
కొత్త S12 ప్రాసెసర్ వల్ల బ్యాటరీ పవర్ ఆదా అయినప్పటికీ, వాచ్ వాడే సమయం మాత్రం మునుపటి సిరీస్ లాగే ఒక రోజు (దాదాపు 24 గంటలు) మాత్రమే వస్తుంది. గార్మిన్, హువావే వంటి ఇతర కంపెనీలు కొన్ని రోజుల పాటు వచ్చే బ్యాటరీ లైఫ్ ఇస్తున్నప్పటికీ, యాపిల్ మాత్రం రోజువారీ స్థిరమైన పెర్ఫార్మెన్స్‌కే మొగ్గు చూపింది.
వాచ్ ఓఎస్ 27 రూపంలో ఈసారి సాఫ్ట్‌వేర్ విభాగానికి పెద్దపీట వేశారు. ఇందులో వచ్చే సిరి ఎఐ సపోర్ట్‌తో మనం మాట్లాడే సంభాషణలను అర్థం చేసుకుని, మన అలవాట్లకు తగ్గట్టుగా స్పందిస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్‌లతో చాలా సులభంగా కనెక్ట్ అవ్వడమే కాకుండా, మనం ఎక్కువగా వాడే యాప్‌లు హోమ్ స్క్రీన్‌పై ముందుకొచ్చేలా కొత్త డిజైన్ అందించారు.
ఇందులోని కొత్త ప్రాసెసర్ మన ఆరోగ్య వివరాలను మరింత కచ్చితత్వంతో ట్రాక్ చేస్తుంది. గుండె వేగంలో వచ్చే మార్పులను, రాత్రివేళ నిద్ర నాణ్యతను, రోజువారీ వర్కవుట్‌లను మునుపటి కంటే చాలా పక్కాగా లెక్కగడుతుంది. కొత్త హెల్త్ ఫీచర్లు రాలేదనే చిన్న నిరాశ ఉన్నప్పటికీ, ఉన్న ఫీచర్లనే మరింత నమ్మకమైనవిగా తీర్చిదిద్దారు.
Also Read: బోల్ట్ నుంచి మొదటి ఏఐ ఫోన్.. టెక్నో నుంచి గేమింగ్ బీస్ట్, ఏ రోజు లాంచ్ అవుతున్నాయంటే?