E-Paper
Advertisement

బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్ కావాలా? టాప్ 5 బ్రాండ్స్, ఫీచర్స్!

బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్ కావాలా? టాప్ 5 బ్రాండ్స్, ఫీచర్స్!
Advertisement

Best deep freezers for restaurants Amazon: వ్యాపార రంగంలో, ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో కస్టమర్లకు ఎప్పుడూ తాజా ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. దీనికోసం కమర్షియల్ కిచెన్లలో డీప్ ఫ్రీజర్లు కీలక పాత్ర పోషిస్తాయి. నాన్ వెజ్, పాల ఉత్పత్తులు, కూరగాయలు, ఐస్‌క్రీమ్‌లు చెడిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. బెస్ట్ డీప్ ఫ్రీజర్ ఉండాల్సిందే. మార్కెట్లో లభించే అనేక బ్రాండ్లలో బ్లూ స్టార్, హైయర్ బ్రాండ్లు తమ క్వాలిటీకి ప్రసిద్ధి చెందాయి. అమెజాన్‌లో లభించే ఈ రెండు ప్రముఖ బ్రాండ్లకు చెందిన టాప్ 5 డీప్ ఫ్రీజర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.Blue Star 300 L Hard Top Chest Freezer:

రెస్టారెంట్లు, కేఫ్‌లకు ఈ మోడల్ చాలా అనుకూలంగా ఉంటుంది. 300 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఫ్రీజర్ తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ కాలం పనిచేస్తుంది. దీని పటిష్టమైన హార్డ్ టాప్ డిజైన్ ఆహారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. హెవీ డ్యూటీ వాడకానికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అమెజాన్‌లో ఈ మోడల్ ధర సుమారు రూ. 26,000 నుంచి రూ. 28,000 మధ్య ఉంటుంది.

2.Haier 400 L Double Door Chest Freezer:

Advertisement

పెద్ద కేటరింగ్ వ్యాపారాలు , హోటళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో 400 లీటర్ల భారీ కెపాసిటీ ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో ఆహార పదార్థాలు, నాన్ వెజ్, కూరగాయలను ఈజీగా నిల్వ చేసుకోవచ్చు. డబుల్ డోర్ అవకాశం కూడా ఉండటం వల్ల ఫ్రీజర్‌లోని వస్తువులు ఈజీగా అందుకోవచ్చు. అంతే కాకుండా దీనిలోని చల్లదనం బయటకుపోకుండా ఉంటుంది. దీని ధర సుమారు రూ. 34,000 నుంచి రూ. 37,000 మధ్య ఉంటుంది.

3.Blue Star 400 L Dual Temperature Freezer:

Advertisement

ఒకే మెషీన్‌లో ఫ్రీజింగ్ , కూలింగ్ రెండూ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. కేఫ్‌లు , బేకరీలలో వివిధ రకాల పదార్థాలను విడి విడిగా స్టోర్ చేయడానికి ఈ డ్యూయల్ టెంపరేచర్ ఫ్రీజర్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది వ్యాపారస్తుల అవసరాలకు తగినట్లుగా ఉష్ణోగ్రతను నియంత్రించే వెసులుబాటును ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 33,000 నుంచి రూ. 36,000 మధ్య ఉంటుంది.

4.Haier 200 L Single Door Chest Freezer:

చిన్న కేఫ్‌లు, జ్యూస్ షాపులు లేదా తక్కువ స్థలం ఉన్న చిన్న రెస్టారెంట్లకు ఈ 200 లీటర్ల మోడల్ చక్కగా సరి పోతుంది. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు, కరెంట్ బిల్లు ఆదాలోనూ ముందుంటుంది. చిన్న వ్యాపారాలు ప్రారంభించే.. వారికి బడ్జెట్ ధరలో ఇది అద్భుతమైన ఆప్షన్. దీని ధర సుమారు రూ.19,000 నుంచి రూ.21,000 మధ్య ఉంటుంది.

Also Read: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

5. Blue Star 500 L Heavy Duty Chest Freezer:

పెద్ద స్థాయి క్యాటరింగ్ సర్వీసులు,  రెస్టారెంట్ల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 500 లీటర్ల భారీ నిల్వ సామర్థ్యం కలిగి ఉండటంతో.. పాటు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ నిరంతరం అద్భుతమైన కూలింగ్ అందిస్తుంది. హెవీ డ్యూటీ కంప్రెసర్ దీని ప్రత్యేకత. దీని ధర సుమారు రూ. 42,000 నుంచి రూ. 45,000 వరకు ఉంటుంది.

డీప్ ఫ్రీజర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు:
వ్యాపార పరిమాణం, స్టోరేజ్ అవసరాలను బట్టి సరైన లీటర్ల సామర్థ్యాన్ని ఎంచుకోవాలి. కమర్షియల్ అవసరాలకు వాడేవి కాబట్టి తక్కువ కరెంట్ బిల్లు వచ్చే ఎనర్జీ ఎఫిషియెంట్ మోడల్స్‌ను ఎంచుకోవడం మంచిది. అలాగే కంప్రెసర్ , మెషీన్ పై లభించే వారంటీ వివరాలను కచ్చితంగా చెక్ చేయాలి.

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×