Ask Maps AI: సాధారణంగా ఏదైనా అడ్రస్ తెలియని లొకేషన్‌కి వెళ్లాలంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. అయితే ఇప్పటివరకు మనల్ని సేఫ్‌గా గమ్యస్థానానికి చేర్చిన ఈ యాప్.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి మన అవసరాలను తీర్చడానికి రెడీ అయిపోయింది. అవును.. గూగుల్ మ్యాప్స్‌లో తీసుకొచ్చిన కొత్త ఏఐ అప్‌డేట్‌తో ఇకపై దారి వెతుక్కోవడమే కాదు.. మనకు నచ్చిన తిండి ఆర్డర్ చేయడం, హోటల్ బుక్ చేసుకోవడం లాంటి పనులన్నీ చిటికెలో పూర్తయిపోతాయి. అసలు ఈ కొత్త మార్పులతో మ్యాప్స్ వాడే అనుభవం ఎలా మారబోతుందో ఓసారి చూద్దాం.
ఇప్పటివరకు మనం అడిగిన ప్రశ్నలకు గూగుల్ మ్యాప్స్ కేవలం సమాధానాలు మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ‘ఆస్క్ మ్యాప్స్’ ఫీచర్ మన తరఫున పనులను నేరుగా పూర్తి చేస్తుంది. హోటల్ గదులు వెతకడం నుంచి తిండి ఆర్డర్ చేయడం వరకు అన్ని పనులను సులభంగా చేసి పెడుతుంది.
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో మనకు నచ్చిన స్నాక్స్ తినాలనిపిస్తే.. ఇకపై వేరే యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. మనకు కావాల్సిన వంటకం పేరు చెబితే చాలు, మన రూట్‌లో ఉన్న మంచి రెస్టారెంట్లను వెతికి ఇస్తుంది. అంతేకాకుండా అక్కడికక్కడే ఆ డిష్‌ను కార్ట్‌లోకి యాడ్ చేసి పేమెంట్ చేసే వెసులుబాటు కూడా లభిస్తుంది.
Also Read: ఏడాది వ్యాలిడిటీ నుండి ఇంటర్నేషనల్ రోమింగ్ వరకు.. Airtel బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ లిస్ట్!
మన బడ్జెట్, నచ్చిన వసతులు, ప్రసిద్ధ ప్రాంతాలకు దగ్గరగా ఉండే హోటళ్ల వివరాలను గూగుల్ మ్యాప్స్ క్షణాల్లో పోల్చి చూపిస్తుంది. దీనికితోడు మనం ఉన్న నగరంలో జరిగే స్థానిక ఈవెంట్లు, వాటి టికెట్ బుకింగ్ లింక్‌లను కూడా నేరుగా అందిస్తుంది.
మన అనుమతితో గూగుల్ మ్యాప్స్ మన జీమెయిల్ ఖాతాలోని ప్రయాణ సమాచారాన్ని, ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ రిజర్వేషన్ వివరాలను తెలుసుకోగలదు. దీంతో ప్రతీసారి మన ప్లాన్స్ గురించి ప్రత్యేకంగా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇది ఒక పర్సనల్ ట్రావెల్ గైడ్‌లా మనకు సాయపడుతుంది.
బస్సులు, రైళ్లు, మెట్రోల కచ్చితమైన సమయాలు, రైళ్ల ఆలస్యం సమాచారాన్ని ఒక ప్రత్యేక లైవ్ విడ్జెట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే యూజర్లు కూడా షాపుల బోర్డులను ఫొటో తీసి అప్‌లోడ్ చేయడం ద్వారా ఆ దుకాణం తెరిచే సమయాలను చాలా సులభంగా అప్‌డేట్ చేయవచ్చు. మొత్తానికి గూగుల్ మ్యాప్స్ కేవలం దారి చూపే సాధనంగానే కాకుండా, మన పనులను చిటికెలో పూర్తి చేసే ఆల్‌ఇన్‌వన్ డిజిటల్ అసిస్టెంట్‌లా మారిపోనుంది.
Also Read: శాంసంగ్ నుంచి మరో సూపర్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్, కొత్త డిజైన్ చూశారా?