E-Paper
Advertisement

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!
Advertisement

Amazon Freedom Sale 2026 security camera deals: ఈరోజుల్లో ఇల్లు అయినా, ఆఫీస్ అయినా సరే సేఫ్టీ చాలా ముఖ్యం అయిపోయింది. మనం ఇంట్లో లేనప్పుడు కూడా ఇంట్లో ఏం జరుగుతుందో, పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో ఎప్పటికప్పుడు మన ఫోన్‌లోనే చూసుకునేందుకు ఈ హోమ్ సెక్యూరిటీ కెమెరాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. దీన్ని దృష్టిలో.. పెట్టుకుని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ‘ఫ్రీడమ్ సేల్ 2026’ను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో సీపీ ప్లస్, క్యూబో లాంటి టాప్ బ్రాండ్ల కెమెరాలపై మంచి మంచి డిస్కౌంట్లు, అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో దొరికే ఆ బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఏంటో, వాటి ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. CP Plus 3MP Ezykam Wi-Fi Security Camera:

హోమ్ సెక్యూరిటీ అనగానే టక్కున గుర్తుకువచ్చే బ్రాండ్ సీపీ ప్లస్.ఈ 3MP ఈజీక్యామ్ వైఫై కెమెరా వీడియో క్లారిటీ చాలా బాగా ఇస్తుంది. ఇది 360 డిగ్రీలు తిరుగుతుంది కాబట్టి, గదిలో ఏ మూలన ఏం జరిగినా స్పష్టంగా.. రికార్డ్ అవుతుంది. రాత్రి పూట కూడా క్లియర్‌గా కనిపించే నైట్ విజన్, ఎవరైనా కదిలితే.. వెంటనే పట్టేసే మోషన్ డిటెక్షన్, అలాగే కెమెరాలో.. నుంచి మనం మాట్లాడటానికి టూ-వే టాక్ లాంటి అదిరిపోయే.. ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్‌లో ఇది సుమారు రూ.1,999 నుంచి రూ.2,300 మధ్యలో వస్తోంది.

2. Qubo Smart Cam 360 by Hero Group:

Advertisement

మన హీరో గ్రూప్‌కు చెందిన ‘క్యూబో’ బ్రాండ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌లో చాలా ఫేమస్. ఈ క్యూబో స్మార్ట్ క్యామ్ 360 కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పని చేస్తుంది. అంటే.. ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెంటనే.. మన ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. ప్రైవసీ మోడ్ దీని మరో స్పెషాలిటీ. అమెజాన్ సేల్‌లో ఈ కెమెరా కేవలం రూ. 2,199 ధరకే మనకు దొరుకుతుంది.

3. Mi 360° Home Security Camera 2K:

మంచి హై క్వాలిటీ వీడియో కావాలనుకునే.. వాళ్లకు షావోమి (Mi) 2K సెక్యూరిటీ కెమెరా మంచి ఛాయిస్. ఇది అల్ట్రా క్లియర్ 2K క్వాలిటీలో వీడియోలను ఇస్తుంది. తక్కువ వెలుతురు ఉన్నప్పటికీ.. కలర్ వీడియోలను రికార్డ్ చేయగలగడం దీని ప్రత్యేకత. అలాగే మాటలు క్లియర్‌గా వినిపించేందుకు డ్యూయల్ మైక్రోఫోన్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ కూడా ఉంది. ఫ్రీడమ్ సేల్ డిస్కౌంట్‌లో ఈ కెమెరా ధర సుమారు రూ.2,899 దాకా ఉంది.

Advertisement

Also Read: తక్కువ బడ్జెట్‌లో ఫ్యాన్ ప్లస్ లైట్.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన మోడల్స్

4. TP-Link Tapo C200 360° 2MP 1080p Wi-Fi Pan/Tilt Camera:

టీపీ-లింక్ టాపో సీ200 కెమెరా దాని పర్ఫార్మెన్స్‌కు చాలా పేరు సంపాదించుకుంది. దీన్ని ఇంట్లో సెట్ చేసుకోవడం చాలా ఈజీ. మంచి నైట్ విజన్ ఫీచర్‌తో పాటు, వీడియోలు దాచుకోవడానికి మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అమెజాన్ సేల్‌లో ఈ మోడల్ కేవలం రూ.2,099 కే మన సొంతం చేసుకోవచ్చు.

5. RealMi Smart WiFi Security Camera:

తక్కువ బడ్జెట్‌లో అన్ని లేటెస్ట్ ఫీచర్లు కావాలనుకునే వాళ్ళ కోసం రియల్‌మీ స్మార్ట్ కెమెరా అద్భుతమైన ఆప్షన్. ఫుల్ హెచ్‌డీ రికార్డింగ్, మనం ఎటు కదిలితే అటు కెమెరా తిరిగే మోషన్ ట్రాకింగ్, క్లౌడ్ స్టోరేజ్ లాంటి అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఈ కెమెరా సుమారు రూ. 1,799 నుంచి రూ. 2,000 లోపే లభిస్తోంది.

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026లో ఈ కెమెరాలను తీసుకుంటే అదనంగా బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు కూడా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇల్లు లేదా షాప్ సేఫ్టీ కోసం ఈసారే ఒక మంచి సెక్యూరిటీ కెమెరా తీసేసుకోండి.

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×