E-Paper
Advertisement

రూ.20,000 ఉంటే.. సొంతూళ్లలోనే దర్జాగా చేసుకునే వ్యాపారాలు.. ఇక సిటీ ఊసే అక్కర్లేదు!

రూ.20,000 ఉంటే.. సొంతూళ్లలోనే దర్జాగా చేసుకునే వ్యాపారాలు.. ఇక సిటీ ఊసే అక్కర్లేదు!
Advertisement

Village Business Ideas: ఒకప్పుడు గ్రామాల్లో వ్యవసాయం మినహా వేరే ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండేవి కావు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పల్లెల్లోనూ ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రజల జీవనశైలి మెరుగుపడటంతో స్థానికంగానే వివిధ రకాల సేవలు, వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో తక్కువ పెట్టుబడితో ప్రారంభించే చిన్న వ్యాపారాలకు పల్లెల్లో విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం రూ. 20,000 పెట్టుబడితో గ్రామాల్లో ప్రారంభించగల కొన్ని లాభదాయకమైన వ్యాపారాల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

పాలు విక్రయించే వ్యాపారం

గ్రామీణ ప్రాంతాల్లో డైరీ వ్యాపారం లాభదాయకమైన వ్యాపార మార్గంగా నిలుస్తోంది. రూ. 20,000 పెట్టుబడితో భాగస్వామ్యం, ముందస్తు చెల్లింపు, అద్దె ప్రాతిపదికన పశువులను తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తాజా పాలను నేరుగా ఇళ్లకు సరఫరా చేయడం ద్వారా కస్టమర్లను త్వరగా ఆకట్టుకోవచ్చు.

డైరీ ఉత్పత్తుల విక్రయం

Advertisement

కేవలం పాలే కాకుండా పెరుగు, పన్నీర్, నెయ్యి వంటి డైరీ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కూడా గ్రామాల్లో ఇంటి నుంచే ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాల విక్రయాల వల్ల నిత్యం చేతికి నగదు అందుతుంది. అదే పాలతో తయారయ్యే డైరీ ఉత్పత్తుల సేల్స్ వల్ల సైతం గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. సమీపంలోని పట్టణాలకు కూడా వాటిని సరఫరా చేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.

పిండి, మసాలా గ్రైండింగ్ సేవలు

చాలా గ్రామాల్లోని ప్రజలు గోధుమలు, మొక్కజొన్నలు, ఇతర ధాన్యాలను పిండి పట్టించుకోవడానికి సమీపంలోని టౌన్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా స్థానికంగానే ఒక చిన్న పిండి గిర్కి (Flour Mill), మసాలా గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయవచ్చు. రూ.20 వేల లోపు బడ్జెట్ లో సెకండ్ హ్యాండ్ మిషన్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు. గ్రామాల్లో పసుపు, కారం, ధనియాలు వంటి మసాలా దినుసులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబట్టి ప్రజలు తమ ధాన్యాలను నేరుగా తెచ్చి పట్టించుకోవడానికి ఆసక్తి చూపుతారు.

Advertisement

Also Read: రూ. 10 లక్షల పెట్టుబడి.. సింగిల్ ఎఫ్‌డీ vs మల్టిపుల్ ఎఫ్‌డీలు.. అధిక రాబడికి ఏది బెస్ట్?

మొబైల్ రిపేర్, పరికరాల షాప్

ప్రస్తుతం పల్లెల్లోని ప్రతి ఇంట్లోనూ స్మార్ట్‌ఫోన్‌లు ఉంటున్నాయి. కానీ చిన్నపాటి రిపేర్ వచ్చినా సిటీకి పరిగెత్తాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ రీచార్జ్‌లు, చిన్నపాటి రిపేర్లు, బేసిక్ ఫోన్ యాక్సెస్సరీస్ విక్రయించే షాపును గ్రామాల్లో ఏర్పాటు చేయవచ్చు. ఫోన్ కవర్లు, చార్జర్లు, ఇయర్‌ఫోన్‌ల వంటి వస్తువులపై మంచి లాభాల మార్జిన్ ఉంటుంది. రీచార్జ్‌లు, సిమ్ కార్డ్ యాక్టివేషన్లు, చిన్న రిపేర్ల ద్వారా రోజువారీ సంపాదన స్థిరంగా వస్తుంది. మెుబైల్ స్క్రీన్, బ్యాటరీ మార్చడం వంటి చిన్నచిన్న నైపుణ్యాలను నేర్చుకుంటే ఈ వ్యాపారంలో మరింతగా రాణించి సంపాదనను పెంచుకోవచ్చు.

Also Read: స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీన్ రివర్స్.. జనసేనలోకి వంగవీటి రాధా! విజయవాడ మేయర్‌గా బరిలోకి

Tags

Related News

రూ. 10 లక్షల పెట్టుబడి.. సింగిల్ ఎఫ్‌డీ vs మల్టిపుల్ ఎఫ్‌డీలు.. అధిక రాబడికి ఏది బెస్ట్?

బంగారం-వెండి ధరలు పతనం.. మార్కెట్లో రేటు ఎలా ఉంది? బులియన్ మార్కెట్ వర్గాల మాటేంటి?

పండుగ వేళ ఇల్లు కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్.. బిల్డర్లు ఇచ్చే ఆఫర్లను నమ్మవచ్చా?

ద్రవ్యోల్బణం సెగతో స్టాక్ మార్కెట్ భారీగా పతనం.. ఇవాళ నష్టపోయిన స్టాక్స్ ఇవే?

రూ. 50,000 ఉంటే చాలు.. రేపే ఈ వ్యాపారాలు స్టార్ట్ చేయెుచ్చు.. రూ.లక్షల్లో ఆదాయం!

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి రూ. లక్ష వడ్డీ రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి?

ఈఎంఐలు కట్టలేక అల్లాడుతున్నారా? ఈ 5 ట్రిక్స్ పాటిస్తే చాలు.. దెబ్బకు బయటపడతారు!

Big Stories

Advertisement
×