E-Paper
Advertisement

కేకులు, తందూరీలు ఇంట్లోనే చేసుకోవాలంటే.. బడ్జెట్‌లో లభించే టాప్ కన్వెక్షన్ ఓవెన్లు ఇవే!

కేకులు, తందూరీలు ఇంట్లోనే చేసుకోవాలంటే.. బడ్జెట్‌లో లభించే టాప్ కన్వెక్షన్ ఓవెన్లు ఇవే!
Advertisement

Best Microwave Ovens: వంటగదిలో పని సులువు అవ్వాలన్నా, రకరకాల వంటకాలు త్వరగా సిద్ధం కావాలన్నా మంచి మైక్రోవేవ్ ఓవెన్ ఉండాల్సిందే. సాధారణంగా కేవలం ఆహారాన్ని వేడి చేసుకోవడానికి వాడే సోలో మైక్రోవేవ్‌ల కంటే, కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్లు చాలా మేలైనవి. వీటిలో మైక్రోవేవ్ శక్తితో పాటు వేడి గాలిని తిప్పే ఫ్యాన్ వ్యవస్థ ఉండటం వల్ల బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటి అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమమైన మోడళ్ల గురించి తెలుసుకుందాం.

చిన్న కుటుంబాలకు తగిన మోడల్స్..

ఒక్కరు లేదా ఇద్దరు ఉన్న చిన్న కుటుంబాలకు 20 లీటర్ల కెపాసిటీ ఉన్న మైక్రోవేవ్‌లు సరిపోతాయి. ఈ విభాగంలో ఐఎఫ్‌బి (IFB 20 L – 20SC2) మోడల్ మంచి ప్రజాదరణ పొందింది. దీనిలో ఆటో డీఫ్రాస్ట్, మల్టీ స్టేజ్ కుకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే విల్‌పూల్ మేజికూక్ ప్రో (Whirlpool 20 L), వోల్టాస్ బెకో (Voltas Beko 20 L) మోడళ్లు కూడా తక్కువ ధరలో, సులువైన వాడకంతో చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయి.

మధ్యస్థ కుటుంబాల కోసం ..

Advertisement

ముగ్గురు లేదా నలుగురు ఉన్న కుటుంబాలకు 21 లీటర్ల మోడళ్లు బాగుంటాయి. శాంసంగ్ 21 లీటర్ల (Samsung CE76JD B1 XTL) మోడల్‌లోని సెరామిక్ ఎనామిల్ కోటింగ్ శుభ్రం చేయడానికి చాలా తేలికగా ఉంటుంది. అలాగే ఎల్‌జి 21 లీటర్ల (LG MC2146BV) మోడల్ వంటకాలకు, బేకింగ్‌కు బాగా సెట్ అవుతుంది. ఇందులో ఆటో కుక్ ప్రోగ్రామ్స్, స్టీమ్ క్లీనింగ్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి.

Also Read: వంట పనిని సగం తగ్గించే 6 కిచెన్ సాధనాలు.. ప్రతీ ఇంట్లోనూ ఇవి ఉండాల్సిందే!

బిగ్ ఫ్యామిలీస్‌కు పానాసోనిక్ 27 లీటర్లు..

Advertisement

ఎక్కువ మంది ఉన్న ఇళ్లకు లేదా తరచూ కేకులు, గ్రిల్డ్ ఐటమ్స్ ఎక్కువ పరిమాణంలో చేసుకునేవారికి పానాసోనిక్ 27 లీటర్ల (Panasonic NN CT645BFDG) మోడల్ సరైన ఎంపిక. దీనిలో ఉన్న మేజిక్ గ్రిల్ టెక్నాలజీ వల్ల చికెన్, పనీర్ వంటివి సమానంగా, రుచిగా వేగుతాయి. ఎక్కువ స్థలం ఉండటం వల్ల పెద్ద గిన్నెలు కూడా సులువుగా పెట్టుకోవచ్చు.

కేకులు, తందూరీ వంటలు చేసుకోవచ్చా?

కన్వెక్షన్ మైక్రోవేవ్‌లో కేకులు, బిస్కెట్లతో పాటు పనీర్ టిక్కా, గ్రిల్డ్ చికెన్ వంటి తందూరీ వంటకాలను కూడా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. అయితే ఏ వంటకానికి ఏ ఆప్షన్ వాడాలి? ఉష్ణోగ్రత ఎంత ఉండాలనేది.. ఆయా కంపెనీల మాన్యువల్ పుస్తకం చూసి ఉపయోగించడం మంచిది.

ఎలాంటిది ఎంచుకోవాలి?

మైక్రోవేవ్ కొనేటప్పుడు కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాకుండా.. మీ ఇంట్లో మనుషుల సంఖ్య, మీరు రోజూ చేసే వంటల రకాలను బట్టి మోడల్‌ను ఎంచుకోవాలి. కొనేముందు ఆయా ఆన్‌లైన్ స్టోర్లలో ధరలు, ఆఫర్లు సరిచూసుకుని సరైన నిర్ణయం తీసుకోవడం మేలు.

Also Read: పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే స్కిన్ మెరిసిపోయే 7 మ్యాజికల్ గ్యాడ్జెట్స్ ఇవే!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×