Vande Mataram Controversy: కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. పంద్రాగస్టు రోజున కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ‘వందేమాతరం’ ఆలపిస్తుండగా ఆ గీతాన్ని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దీంతో కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు.. దీనిపై ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఆగస్టు 15న ఏఐసీసీ ప్రధాన కార్యాలయం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లీకార్జున ఖర్గే, సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ క్రమంలో వందేమాతరం ఆలపిస్తుండగా.. ఆ సమయంలో సోనియా గాంధీ చేసిన సైగలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో వ్యతిరేకించిన చరణాలను ఆలపించేటప్పుడు ఆమె అభ్యంతరం తెలిపినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ‘మేము వందేమాతరం పాడటం లేదు’ అన్నట్లు ఉన్న వీడియోను సైతం జతచేసి ఆయనపై కూడా ఫిర్యాదు దారులు పోలీసులకు కంప్లెంట్ ఇచ్చారు.
Listen from 0:20 (from 50 sec video), Rahul is saying to organisers/karyakartas that 'we are not singing vande mataram'.
The first fagmilia, the owners of INC seemed really upset that vande Mataram was sung before flag hoisting ceremony at their party headquarters.
Sonia… pic.twitter.com/4JjLRED1w1
— Dehati Armageddon Neutraliser (@ImperiumHindu) August 15, 2026
న్యాయవాదులు కుణాల్ వినాయక్, శుభ్ శర్మ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. సైగల వెనుక ఉన్న ఉద్దేశంపై దర్యాప్తు జరిపించాలని వారు పోలీసులను కోరారు. ఇటీవల కేంద్రం.. వందేమాతరానికి కూడా జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన గుర్తింపు ఇస్తూ బిల్లు తీసుకొచ్చిందని వారు గుర్తుచేశారు. కాగా ఈ బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం.. జాతీయ గీతాన్ని లేదా జాతీయ గేయాన్ని కావాలని అడ్డుకున్నా, పాడే సమయంలో ఆటంకం కలిగించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.
Also Read: అసెంబ్లీకి పవన్ ఎందుకు రాలేదు? క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల!
మరోవైపు ఈ వందేమాతరం వివాదంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. సోనియా గాంధీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. జాతీయ గేయాన్ని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అగ్రనేతలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒడిశా, బెంగళూరులో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనియా, రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
Also Read: మనిషి పెరిగితే సరిపోదు.. కాస్త బుర్ర కూడా ఉండాలి.. అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డ బొత్స!